స్మృతి మంధాన vs సానియా మీర్జా : ఇద్దరిలో ఎవరు రిచ్.. ఎవరి ఆస్తులెన్ని?

Published : Dec 12, 2025, 01:51 PM IST

Sania Mirza vs Smriti Mandhana : స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇద్దరూ క్రీడలే కాదు ఇతర మార్గాల్లో రెండుచేతులా సంపాదిస్తున్నారు. మరీ వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ఆస్తులను కలిగివున్నారో తెలుసా? 

PREV
15
సానియా వర్సెస్ మంధానా

Smriti Mandhana Vs Sania Mirza : టీమిండియా మెన్స్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న ఉమెన్స్ క్రికెటర్ స్మృతి మంధాన. ఇక ఇండియన్ టెన్నిస్ స్టార్, హైదరాబాదీ ఆడబిడ్డ సానియా మీర్జా పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు తమ క్రీడా నైపుణ్యంతోనే కాదు అందంతోనూ అభిమానుల మనసులు గెలుచుకున్నారు.

ఈ ఇద్దరు వరల్డ్ లెవెల్ క్రీడాకారులు తమ ఆటతోనే కాదు ఎండార్స్ మెంట్స్, ఇతర ఆదాయమార్గాల ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. భారత టెన్నిస్ క్రీడాకారుల్లో సానియా, ఉమెన్స్ క్రికెటర్లలో స్మృతి మంధాన రిచ్చెస్ట్ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు అత్యధిక ఆదాయం, ఆస్తిపాస్తులు కలిగివున్నారో తెలుసా? ఇక్కడ తెలుసుకుందాం.

25
స్మృతి నికర ఆస్తి ఎంతో తెలుసా?

పలు రిపోర్ట్స్ ప్రకారం… 2025లో స్మృతి మంధాన నికర ఆస్తి రూ. 32 నుంచి 34 కోట్లు ఉంటుంది. ఆమె సంపాదనకు ప్రధాన వనరులు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ (గ్రేడ్ ఎ), డబ్ల్యూపీఎల్ (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) లో ఆర్‌సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) నుంచి రూ. 3.4 కోట్ల జీతం, వివిధ బ్రాండ్స్ ఎండార్స్‌మెంట్లు.

35
సానియా మీర్జా ఆస్తులెన్నో తెలుసా?

ఇక హైదరబాదీ క్రీడాకారిణి సానియా ఇండియా తరపున టెన్నిస్ ఆడారు... 2023 లోనే రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ప్రొఫెషనల్ టెన్నిస్ కు దూరంగా ఉంటున్నా సంపాదన మాత్రం ఆగడంలేదు. వివిధ ఎండార్స్ మెంట్స్ ద్వారా సానియాకు మంచి ఆదాయం వస్తోంది. సానియా మీర్జా నికర ఆస్తి రూ. 216 కోట్లు (26 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. ఆమె వార్షిక ఆదాయం రూ.25 కోట్లు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, టెన్నిస్ అకాడమీ, రియల్ ఎస్టేట్ ఆమె సంపాదనకు ప్రధాన మార్గాలు.

45
స్మృతి మందాన నవ్వితేచాలు.. అభిమానులు ఫిదా

భారత మహిళా జట్టు ఓపెనింగ్ బ్యాటర్ స్మృతి మందాన తన ఆటతో ప్రపంచ క్రికెట్‌లో దేశానికి పేరు తెచ్చింది. టెస్టులు, వన్డేలు, టీ20లలో ఆమె ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇటీవల ఆమె టీమిండియాకు తొలి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ టైటిల్ గెలిపించింది.

మైదానంలో స్మృతి మంధాన బ్యాటింగ్‌తో ఎంత అలరిస్తుందో, అంతకంటే ఎక్కువగా తన అందంతోనూ చర్చల్లో ఉంటుంది. ఆమె స్టైల్, హావభావాలు, చిరునవ్వు లక్షలాది మంది అభిమానులను ఫిదా చేస్తాయి. దేశ, విదేశాల్లో ఆమెకు అభిమానులకు కొదవలేదు.

55
రిటైర్మెంట్ తర్వాతకూడా సానియా క్రేజ్ తగ్గలేదు

మరోవైపు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా స్మృతి మందానకు ఏమాత్రం తక్కువ కాదు. ఆమె ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినా, ప్రపంచంలో ఆమె వేసిన ముద్ర అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. ప్రపంచంలోని వేర్వేరు మూలలకు వెళ్లి మన దేశానికి పేరు తెచ్చింది.

అందం విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా స్మృతి మందానకు ఏమాత్రం తక్కువ కాదు. ఆమె స్టైల్‌కు లక్షలాదిమంది అభిమానులు ఫిదా అవుతారు. రిటైర్మెంట్ తర్వాత కూడా సానియాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె స్టైల్ ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే.

Read more Photos on
click me!

Recommended Stories