Team India Squad : సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. శుభ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చారు. రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డిలకు జట్టులో చోటు లభించలేదు.
దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం అధికారికంగా భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న ఈ స్క్వాడ్‌లో కీలక ఆటగాళ్ల రీఎంట్రీలు, కొన్ని ఆశ్చర్యకర మార్పులు జరిగాయి.
ముఖ్యంగా గాయాల నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా, యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులో చేరుతున్నారు. అయితే తమ ఫామ్‌తో ఆకట్టుకుంటున్న రింకూ సింగ్, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిలకు స్క్వాడ్‌లో చోటు దక్కకపోవడం అభిమానుల్లో నిరాశను కలిగించింది.
25
గిల్, హార్దిక్ తిరిగి జట్టులోకి.. కానీ చిన్న ట్విస్ట్
గత నెల టెస్టు సిరీస్‌లో మెడ నొప్పి కారణంగా గిల్ మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిట్‌నెస్ మెరుగుపడడంతో సెలెక్టర్లు అతన్ని టీ20 జట్టులో చేర్చారు. అయితే అతడు నిజంగా ఆడతాడా? లేదా అనేది బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నుండి వచ్చే ఫిట్‌నెస్ రిపోర్టుపైనే ఆధారపడి ఉంటుంది.
హార్దిక్ పాండ్యా విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆసియా కప్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తిరిగి మైదానంలో అడుగు పెట్టి ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో తిరిగి జట్టులోకి రావడానికి మార్గం సుగమమైంది.
35
రింకూ సింగ్, నితీశ్ రెడ్డి ఔట్ తో అభిమానుల్లో అసంతృప్తి
మిడిల్ ఆర్డర్‌లో కీలక అవకాశాలు అందుకున్నప్పుడల్లా మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన రింకూ సింగ్ ఈసారి స్క్వాడ్‌లో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా రీఎంట్రీ కోసం రింకూనే పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
అలాగే, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా పర్యటనకు ఎంపిక కాలేదు. ఈ ఇద్దరిని జట్టులోకి తీసుకోకపోవడం పై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.
ప్రస్తుతం వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, పూర్తి ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్లు సంజూ శాంసన్, జితేశ్ శర్మలను స్క్వాడ్‌లో కొనసాగించారు. అక్షర్ పటేల్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి యంగ్ టాలెంట్‌తో జట్టు బ్యాలెన్స్‌గా కనిపిస్తోంది.
2026 టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో ప్రదర్శన కీలకమని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన స్క్వాడ్‌నే వరల్డ్ కప్ జట్టుగా తీసుకెళ్లే అవకాశాలున్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
55
IND vs SA T20 : పూర్తి స్క్వాడ్, టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే