T20 World Cup: జింబాబ్వేపై 72 పరుగుల భారీ విజయంతో టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 రౌండ్‌లో పాయింట్ల ఖాతా తెరిచింది. అయితే, ఈ గెలుపు తర్వాత కూడా నెట్ రన్ రేట్ కారణంగా భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోనే కొనసాగుతోంది.
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా జింబాబ్వేపై భారత జట్టు ఘనవిజయం సాధించినప్పటికీ, పాయింట్ల పట్టికలో స్థానం విషయంలో టీమిండియాకు పెద్దగా ఊరట లభించలేదు. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కానీ నెట్ రన్ రేట్(NRR) సమీకరణాలు భారత్‌ను మూడో స్థానానికే పరిమితం చేశాయి.
25
గ్రూప్-1 పాయింట్ల పట్టిక పరిస్థితి
ప్రస్తుతం గ్రూప్-1లో జట్ల స్థానాలు ఇలా ఉన్నాయి. దక్షిణాఫ్రికా ఆడిన 2 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధించి 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. +2.890 మెరుగైన నెట్ రన్ రేట్‌తో ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. వెస్టిండీస్ ఆడిన 2 మ్యాచ్‌లలో 1 విజయం, 1 ఓటమితో 2 పాయింట్లు కలిగి ఉంది. +1.791 రన్ రేట్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది.
35
సఫారీల చేతిలో ఓటమి.. జింబాబ్వేపై గెలుపు
భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లో సఫారీల చేతిలో ఓటమి.. జింబాబ్వేపై గెలుపుతో ఖాతాలో 2 పాయింట్లతో ఉంది. అయితే రన్ రేట్ -0.100 గా ఉండటంతో ఇంకా మూడో స్థానంలోనే ఉంది. జింబాబ్వే ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయి పాయింట్లు లేకుండా చివరి స్థానంలో నిలిచింది. అలాగే ఈ ఓటమితో జింబాబ్వే సెమీఫైనల్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
ఈ గ్రూప్‌లో ఇప్పుడు ఒకే ఒక్క సెమీఫైనల్ బెర్తు ఖాళీగా ఉంది. మార్చి 1న కోల్‌కతాలో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్‌తో రెండో సెమీఫైనలిస్ట్ ఎవరో తేలిపోతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 4 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఒకవేళ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే, రన్ రేట్ ఆధారంగా వెస్టిండీస్ ముందంజలో ఉంటుంది.
55
గ్రూప్-2లో పరిస్థితి
మరోవైపు గ్రూప్-2లో ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే 4 పాయింట్లతో సెమీస్ చేరింది. రెండో స్థానం కోసం న్యూజిలాండ్(3 పాయింట్లు), పాకిస్థాన్(1 పాయింట్) మధ్య పోటీ నెలకొంది. న్యూజిలాండ్ తన చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడిస్తే నేరుగా సెమీస్ చేరుతుంది. ఒకవేళ కివీస్ ఓడిపోయి, పాకిస్థాన్ తన చివరి మ్యాచ్ గెలిస్తే రన్ రేట్ కీలకంగా మారుతుంది. శ్రీలంక ఇప్పటికే ఈ రేసు నుంచి తప్పుకుంది.