T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026 నాకౌట్ సమరానికి తెరలేచింది. ఉత్కంఠభరితమైన సూపర్-8 పోరు ముగియడంతో సెమీఫైనల్ జట్లు ఖరారయ్యాయి. మార్చి 4న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మొదటి సెమీఫైనల్‌లో..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ స్టేజ్, సూపర్-8 రౌండ్‌లో హోరాహోరీగా తలపడిన జట్ల మధ్య ఇప్పుడు నాకౌట్ పోరు మొదలుకానుంది. గ్రూప్-1 నుంచి అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా, గ్రూప్-2 నుంచి నిలకడైన ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ జట్లు మొదటి సెమీఫైనల్‌లో ఢీకొనబోతున్నాయి. మార్చి 4న కోల్‌కతాలోని చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
25
సెమీస్ బెర్తును ఖరారు..
దక్షిణాఫ్రికా జట్టు ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. సూపర్-8 దశలో భారత్ లాంటి పటిష్ట జట్లను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్ విభాగం ప్రత్యర్థి బ్యాటర్లకు సింహస్వప్నంగా మారింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు 'సైలెంట్ కిల్లర్'గా పేరు తెచ్చుకుంది. ఐసీసీ టోర్నీల్లో ఎప్పుడూ నిలకడగా రాణించే కివీస్, ఈసారి కూడా కీలక మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.
35
పిచ్ స్పిన్నర్లకు, స్లో బౌలర్లకు..
ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్ స్పిన్నర్లకు, స్లో బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాకు ఉన్న 'చోకర్స్' ముద్రను తొలగించుకుని ఫైనల్ చేరడం అతిపెద్ద సవాల్. న్యూజిలాండ్ జట్టుకు ఉన్న నాకౌట్ అనుభవం వారికి ప్లస్ పాయింట్ కానుంది.
గత రికార్డులను పరిశీలిస్తే, నాకౌట్ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ జట్టుకు మంచి పట్టు ఉంది. అయితే, ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే దక్షిణాఫ్రికాను ఓడించడం అంత సులభం కాదు. కోల్‌కతా వాతావరణం, ఫ్లడ్ లైట్ల కింద బంతి కదలికను బట్టి టాస్ గెలిచిన జట్టుకు స్వల్ప ప్రయోజనం ఉండవచ్చు.
55
గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు
ఈ పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ ఉత్కంఠభరిత పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈడెన్ గార్డెన్స్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.