IND Vs WI: వెస్టిండీస్‌తో మ్యాచ్.. టీమిండియా గెలిస్తే.. సెమీస్‌లో తలబడేది ఆ జట్టుతోనే.!

Published : Mar 01, 2026, 10:46 AM IST

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ 2026 సెమీఫైనల్ సమీకరణాలు ఉత్కంఠగా మారాయి. ఒకవేళ భారత జట్టు వెస్టిండీస్‌ను ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే, రెండో సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడే అవకాశం ఉంది. 

PREV
15
నాకౌట్ పోరుకు రంగం సిద్దం

టీ20 ప్రపంచకప్‌ 2026 నాకౌట్ పోరుకు రంగం సిద్ధమైంది. సూపర్-8 దశలో గ్రూప్-1 నుంచి భారత్ అర్హత సాధిస్తే, సెమీఫైనల్‌లో ఎవరితో తలపడనుంది అనే అంశంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. తాజా సమీకరణాల ప్రకారం, భారత జట్టు సెమీస్ చేరితే రెండో సెమీఫైనల్‌లో పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టును ఢీకొనే అవకాశం ఉంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.

25
సెమీఫైనల్ సమీకరణాలు

ఐసీసీ నిబంధనల ప్రకారం, గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్-2లో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో తలపడాల్సి ఉంటుంది. గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా ఇప్పటికే అగ్రస్థానంతో సెమీస్ చేరగా, రెండో స్థానం కోసం భారత్, వెస్టిండీస్ పోటీ పడుతున్నాయి. భారత్ తన చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి రెండో స్థానంలో నిలిస్తే, గ్రూప్-2లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌తో తలపడటం ఖాయం.

35
ముంబైలో మ్యాచ్.. భారత్‌కు కలిసివచ్చే అంశం

రెండో సెమీఫైనల్‌ ముంబైలో జరగనుంది. అది ఫ్లాట్ పిచ్ కావడం.. అలాగే పరుగుల వరద పారితుందని టాక్. భారత జట్టులో హిట్టర్లు చాలామందే ఉన్నారు. టీమ్ ఇండియాకు పెద్ద ప్లస్ పాయింట్ ఇది. గత ప్రపంచకప్ సెమీఫైనల్‌లో కూడా భారత్, ఇంగ్లాండ్ జట్లు ఇక్కడే తలపడ్డాయి. కాబట్టి ఈసారి ఇంగ్లాండ్‌ను ఓడించి పాత బాకీ తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది.

45
రిజర్వ్ డే ఇలా..

ఐసీసీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే సౌకర్యం ఉంటుంది. అయితే ముంబైలో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అయితే.. అదనపు సమయం కేటాయించే అవకాశం ఉంది.

55
బ్రూక్ నేతృత్వంలోని ఆ జట్టు..

ఇంగ్లాండ్ జట్టు ఈ టోర్నీలో భీకరమైన ఫామ్‌లో ఉంది. హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఆ జట్టును ఢీకొట్టడం భారత్‌కు అంత సులభం కాదు. అయితే, భారత బ్యాటర్లు, స్పిన్నర్లు సమష్టిగా రాణిస్తే ఫైనల్ బెర్తు దక్కించుకోవడం కష్టమేమీ కాదు. మరి ఈ దిగ్గజ జట్ల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories