Suryakumar Yadav: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 ఓటమికి తానే పూర్తి బాధ్యుడినని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం, పిచ్‌ను అర్థం చేసుకోలేకపోవడం, బ్యాటింగ్‌లో వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణాలన్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 51 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంలో, బ్యాటింగ్‌లో తమ బ్యాట్స్‌మెన్‌లు వైఫల్యం చెందడమే ఓటమిని శాసించాయని పేర్కొన్నాడు.
25
పిచ్ కండిషన్ అర్ధం చేసుకోలేకపోయాం..
పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యామని సూర్యకుమార్ అంగీకరించాడు. తాము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని, అయితే అప్పుడు వికెట్ ఎలా స్పందిస్తుందనే విషయంపై పూర్తి అవగాహన లేదని చెప్పాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు వేసిన లెంగ్త్‌లను చూసిన తర్వాతే పిచ్ పరిస్థితి ఏంటో అర్థమైందని తెలిపాడు.
35
గిల్ నిలబడాల్సి ఉంది..
తనతో పాటు గిల్ లాంటి కీలక బ్యాటర్లు బాధ్యత తీసుకొని నిలబడాల్సిన అవసరం ఉందని సూర్యకుమార్ పేర్కొన్నాడు. అభిషేక్ శర్మపై ఎక్కువగా ఆధారపడటం సరికాదని, అతడికి కూడా ఆఫ్-డే ఉండవచ్చని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ మొదటి బంతికే ఔట్ అయినప్పుడు తాను బాధ్యత తీసుకోవాల్సిందని, క్రీజులో నిలబడితే మ్యాచ్‌ను గెలిపించగలిగేవాడినని, కానీ అలా జరగలేదని అన్నాడు.
గత మ్యాచ్‌లో అక్షర్ పటేల్ బాగా ఆడాడని, టెస్టుల్లో కూడా మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడని గుర్తు చేస్తూ, అదే నమ్మకంతో ఈ మ్యాచ్‌లోనూ అతడిని బ్యాటింగ్‌లో ముందుకు పంపామని తెలిపాడు. దురదృష్టవశాత్తూ అది వర్కౌట్ కాలేదని అన్నాడు.
55
వచ్చే మ్యాచ్‌లో పుంజుకుంటాం..
అయితే అక్షర్ బాగానే ఆడాడని సూర్య కుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఐదు పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ తమకు ఓ మంచి గుణపాఠమని, వచ్చే మ్యాచ్‌లో మరింత మెరుగ్గా ఆడతామని సూర్యకుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశాడు.