జెమీమా ఐసీసీ ట్రోఫీ గెలిస్తే సర్ఫ్ ఎక్సెల్ ఏం చేసిందో తెలుసా?

Published : Nov 05, 2025, 06:15 AM IST

Surf Excel wins hearts Jemimah: టీమిండియా వన్డే ప్రపంచ కప్ ట్రోఫీ గెలిస్తే.. సర్ఫ్ ఎక్సెల్ టోర్నీ మార్కెటింగ్ ట్రోఫీని గెలిచింది !  జెమీమా రోడ్రిగ్స్ మరక జెర్సీ ఫోటోను సర్ఫ్ ఎక్సెల్ వినూత్నంగా మార్కెటింగ్ క్షణాలుగా మార్చి అందరి హృదయాలు గెలిచింది.

PREV
15
అభిమానుల హృదయాలను గెలుచుకున్న సర్ఫ్ ఎక్సెల్

మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత జట్టు గెలుపుతో దేశమంతా సంబరాలు జరుపుకుంటున్న వేళ, జెమీమా రోడ్రిగ్స్ గ్రౌండ్ లో అద్భుతమైన ఆటతో మట్టి మరకలు అంటుకున్న జెర్సీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫోటోలో ఉన్న జెమిమా పట్టుదల, కష్టం, ఆత్మవిశ్వాసాన్ని అభిమానులు ప్రశంసల వర్షంగా మార్చారు.

ఈ క్షణాన్ని వినూత్నంగా ఉపయోగించుకున్న సర్ఫ్ ఎక్సెల్.. అందరి హృదయాలు గెలుచుకుంది. తమ ప్రసిద్ధ ‘దాగ్ అచ్చే హై’ క్యాంపైన్ కు సరిపోయేలా ఒక సెన్సేషనల్ మార్కెటింగ్ క్షణాన్ని సృష్టించింది.

25
జెమీమాకు సర్ఫ్ ఎక్సెల్ ప్రత్యేక బహుమతి

జెమీమా రోడ్రిగ్స్ ఆస్ట్రేలియాపై సెమీఫైనల్‌లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టింది. భారత్ కు విక్టరీ అందించింది. దీని తర్వాత ఆమె జెర్సీపై ఉన్న మట్టి మరకలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు సర్ఫ్ ఎక్సెల్‌ను ట్యాగ్ చేస్తూ స్పందించమని కోరారు.

దానికి సర్ఫ్ ఎక్సెల్ ప్రతిస్పందన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. వారు జెమీమాకు ఖాళీ సర్ఫ్ ఎక్సెల్ బాటిల్స్ పంపిస్తూ.. “ఈ జెర్సీని ఉతికేయకండి, ఫ్రేమ్ చేయండి” అనే సందేశాన్ని పంపింది. అదే కాకుండా, జెమీమా జెర్సీని నిలువుగా పెట్టుకునే ఫ్రేమ్‌ కూడా పంపింది. ఇది అభిమానులను మాత్రమే కాకుండా మార్కెటింగ్ ప్రపంచాన్ని కూడా తెగ ఆకట్టుకుంది.

35
జెమీమా రోడ్రిగ్స్ జెర్సీ మరకలు..దాగ్ అచ్చే హై

సర్ఫ్ ఎక్సెల్ 2005 నుంచి “దాగ్ అచ్చే హై” అనే ప్రచారంతో మరకులు మన కష్టానికి గుర్తులు అని చెప్పడం కొనసాగిస్తోంది. జెమీమా జెర్సీపై ఉన్న మరకలు నిజంగానే సర్ఫ్ ఎక్సెల్ ప్రచారానికి ప్రతిరూపంగా నిలిచాయి. ఈ బ్రాండ్ ప్రతిస్పందన నిజాయితీగా, సమయోచితంగా ఉండటమే కాకుండా, క్రీడాస్ఫూర్తిని కూడా ప్రతిబింబించింది.

45
ఫ్రేమ్ చేస్తాను, ఖచ్చితంగా.. సర్ఫ్ ఎక్సెల్ పై జెమీమా

జెమీమా రోడ్రిగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సర్ఫ్ ఎక్సెల్ సర్ప్రైజ్ గురించి స్పందిస్తూ.. “గురువారం రాత్రి మాకు ఇంకా గుర్తే ఉంది.. ఈ జెర్సీపై ఉన్న ప్రతి మరక కృషి, ఆనందం, జట్టు స్పూర్తికి గుర్తు. ఇలాంటి మరకలు ఉంటే.. దాగ్ అచ్చే హై.. కాబట్టి ఫ్రేమ్ చేస్తాను” అంటూ పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌కు వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. అభిమానులు “ఇది బ్రాండ్ కాదు, భావోద్వేగం” అంటూ ప్రశంసలు కురిపించారు.

55
మార్కెటింగ్‌లో మాస్టర్‌క్లాస్‌గా నిలిచిన సర్ఫ్ ఎక్సెల్

క్రీడా క్షణాన్ని కేవలం అడ్వర్టైజ్‌మెంట్ కాకుండా, భావోద్వేగానికి చిహ్నంగా మార్చడంలో సర్ఫ్ ఎక్సెల్ విజయం సాధించింది. ఇది “మోమెంట్ మార్కెటింగ్”కు సరిగ్గా సరిపడే ఉదాహరణగా నిలిచింది. తన గిఫ్ట్ తో ఈ బ్రాండ్ తన ప్రచారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లిందని చెప్పాలి. సోషల్ మీడియాలో “Surf Excel nailed it again” అంటూ పోస్టులు వెల్లువెత్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories