Travis Head: ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ పెర్త్ టెస్ట్‌లో 69 బంతుల్లో అద్భుత సెంచరీతో మూడు భారీ రికార్డులు బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ ను చిత్తుచేస్తూ ఆస్ట్రేలియాకు 8 వికెట్ల తేడాతో విజయం అందించాడు. యాషెస్ లో కొత్త రికార్డుల మోత మోగించాడు.
AUS vs ENG పెర్త్ టెస్టులో ట్రావిస్ హెడ్ రికార్డుల వర్షం
సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెడ్ దంచికొడుతూ రికార్డుల మోత మోగిస్తున్నారు. పెర్త్‌లో జరిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఐదు రోజులపాటు సాగాల్సిన ఈ పోరులో సంచలనాలు నమోదయ్యాయి.
బ్యాటింగ్, బౌలింగ్ లో అద్బుత ప్రదర్శనతో మ్యాచ్ రెండో రోజుకే ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపులో మిచెల్ స్టార్క్ బంతితో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ దుమ్మురేపాడు. తన బ్యాట్ పవర్ తో ఆటను పూర్తిగా మార్చేశాడు. మూడు భారీ వరల్డ్ రికార్డులు సాధించాడు.
26
మొదటి రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగింపు
ఈ టెస్ట్ మొదటి రోజు నుంచే వేగంగా సాగింది. మొదటి రోజు పేసర్లు ఆధిపత్యం చెలాయించగా, రెండో రోజు మొత్తం మ్యాచ్‌ను పూర్తిగా మార్చేసిన సంఘటన చోటు చేసుకుంది. రెండో రోజు ఉదయం ఆస్ట్రేలియా బౌలర్లు ఇంగ్లాండ్‌ను కేవలం 164 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 205 పరుగుల లక్ష్యం మాత్రమే ఆస్ట్రేలియాకు ఉండటం మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కేవలం 132 పరుగులకే పరిమితమైన నేపథ్యంలో, ఇంగ్లాండ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ ఓపెనింగ్‌కు రావడంతో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది.
36
ట్రావిస్ హెడ్ 69 బంతుల్లో సెంచరీ.. యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ
ట్రావిస్ హెడ్ తన సెంచరీని కేవలం 69 బంతుల్లో పూర్తి చేశాడు. 83 బంతుల్లో 123 పరుగుల ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఈ సెంచరీ యాషెస్ చరిత్రలో రెండవ అత్యంత వేగమైనదిగా నిలిచింది.
యాషెస్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్. అతను 2006లో కేవలం 57 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు హెడ్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
ఓపెనర్‌గా అత్యంత వేగవంతమైన సెంచరీ.. 127 ఏళ్ల రికార్డు బద్దలు
ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ తీసుకున్న కీలక నిర్ణయం హెడ్ ను ఓపెనర్‌గా పంపడం. ఇది చరిత్రను మార్చేసింది. 1898లో ఓపెనర్ గా జో డార్లింగ్ 85 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ రికార్డును 127 ఏళ్ల తర్వాత ట్రావిస్ హెడ్ అధిగమించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యంత వేగంగా శతకం చేసిన ఆటగాడిగా ట్రావిస్ హెడ్ నిలిచాడు.
56
నాల్గో ఇన్నింగ్స్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు
టెస్ట్ మ్యాచ్ నాల్గో ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా ట్రావిస్ హెడ్ రికార్డు సాధించాడు. అలాగే, నాల్గో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన ప్లేయర్ కూడా అతడే. అతని స్ట్రైక్ రేట్ 148.19 గా ఉంది.
ఇంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో పేరిట ఉంది. అతను 2022లో న్యూజిలాండ్‌పై ఆడిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడాడు.
66
సిక్సుల రికార్డు.. యాషెస్‌లో ఓపెనర్‌గా కొత్త రికార్డు
ట్రావిస్ హెడ్ యాషెస్ టెస్ట్ చరిత్రలో నాల్గో ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సులు బాదిన తొలి ఓపెనర్‌గా గుర్తింపు పొందాడు. అతని 83 బంతుల్లో 123 పరుగుల ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్లతో గెలిచి సిరీస్‌లో 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పుడు రెండో టెస్ట్ డిసెంబర్ 4 నుంచి బ్రిస్బేన్‌లో ప్రారంభం కానుంది. ట్రావిస్ హెడ్ ఈ ఇన్నింగ్స్‌తో యాషెస్ చరిత్రనే మార్చేశాడని చెప్పాలి. తన బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బాజ్ బాల్ శైలీకి సమాధానం చెబుతూ పెర్త్ లో హెడ్ ప్రకంపనలు సృష్టించాడు.