కావ్యపాప రూ. 20 కోట్ల స్కెచ్.. ఆ పవర్ హౌస్ వస్తే.. SRH బ్యాటింగ్ శివతాండవమే..

Published : Nov 17, 2025, 10:00 AM IST

SRH: ఐపీఎల్ 2026 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. పర్స్‌లో రూ. 25.50 కోట్లతో, జట్టుకు 10 మంది కొత్త ఆటగాళ్లు(ఇద్దరు విదేశీయులతో సహా) అవసరం. అభిషేక్, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ జోడీ జట్టుకు కీలకం. 

PREV
15
రిటెన్షన్, రిలీజ్ లిస్టులు

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి జట్లు రిటెన్షన్, రిలీజ్ లిస్టులను విడుదల చేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పక్కా ప్రణాళికతో తమ జట్టులోని ఫామ్ లేమి, నిలకడ లేమితో ఉన్న ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వచ్చే సీజన్ కు ముందుగానే జట్టును పక్కాగా తీర్చిదిద్దాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఎస్‌ఆర్‌హెచ్ మొత్తం 15 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.

25
సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్స్‌ ఇది..

ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్స్‌ రూ. 25.50 కోట్లుగా ఉంది. ఈ పెద్ద మొత్తంతో ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ ఓ కీలక ఆల్ రౌండర్‌ను కొనాలని చూస్తోందట. అలాగే జట్టుకు అవసరమయ్యే పలువురు బౌలర్లను కూడా తీసుకోవాలని చూస్తోంది. మొత్తంమీద జట్టుకు మరో 10 మంది ఆటగాళ్లు అవసరం అని అంచనా. ఈ 10 మందిలో కనీసం ఇద్దరు విదేశీ ఆటగాళ్ల స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి.

35
బ్యాటింగ్ విషయానికొస్తే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఓపెనింగ్ స్థానంలో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీ జట్టుకు కీలకం. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ విధ్వంసక బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తారు. వీరి భాగస్వామ్యం జట్టుకు గణనీయమైన పరుగులు సాధించడంలో సహాయపడుతుంది. మ్యాచ్ పరిస్థితి, బౌలింగ్ నాణ్యత లేదా పిచ్‌తో సంబంధం లేకుండా, ఈ జోడీ క్రీజులో స్థిరపడితే 200 నుంచి 250 పరుగుల భారీ లక్ష్యాలను సైతం నిర్దేశించే ఛాన్స్ ఉంది. అలాగే అంతటి టార్గెట్స్ కూడా చేధించవచ్చు.

45
ఎస్‌ఆర్‌హెచ్ జట్టు బలహీనతలు

ఐపీఎల్ 2026 ముందే ఎస్‌ఆర్‌హెచ్ జట్టు తమ బలహీనతలను గుర్తించి, అందుకనుగుణంగా పర్స్‌లో ఉన్న డబ్బును వినియోగించుకోవాలని చూస్తోంది. కొత్త ఆటగాళ్లను చేర్చుకోవడం ద్వారా, జట్టు బలాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిటెన్షన్ ప్రక్రియ పూర్తవడంతో, ఇప్పుడు దృష్టి ఐపీఎల్ 2026 వేలంలో సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంపై ఉంది. ఈ వ్యూహాత్మక కొనుగోళ్లు ఎస్‌ఆర్‌హెచ్‌ను టోర్నమెంట్‌లో మరింత బలమైన జట్టుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

55
ఓ ప్లేయర్ పై ఫోకస్

అటు పాట్ కమ్మిన్స్ మినీ వేలంలో ఓ ప్లేయర్ పై ఫోకస్ చేయాలని హైదరాబాద్ యాజమాన్యాన్ని కోరాడట. ఇక అతడి కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేయాలని చెప్పాడట. ఇక ఆ ప్లేయర్ కోసమే పలు కీలక ఫ్రాంచైజీలు కూడా పోటీ పడుతున్నాయని టాక్. ఇంతకీ అతడెవరో కాదు.. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్. ఈ మధ్యకాలంలో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories