Shubman Gill: టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో గిల్ లేకపోవడంపై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులోకి రోహిత్ శర్మ ప్రవేశపెట్టిన దూకుడుతనానికి గిల్ సరిపోలేదని అతడు అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ చోటు దక్కించుకోలేకపోయిన సంగతి తెలిసిందే. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశాడు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. టీ20ల్లో గిల్ పతనానికి ముమ్మాటికి రోహిత్ శర్మనే కారణమని చెప్పాడు.
25
రోహిత్ శర్మ కారణం..
టీ20ల్లోకి రోహిత్ శర్మ దూకుడైన ఆటతీరును ప్రవేశపెట్టాడు. ఆ దూకుడు శైలి వల్లే గిల్ తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. గత ప్రపంచకప్‌లో పవర్ ప్లే సమయంలో ప్రత్యర్ధిని దెబ్బకొట్టేందుకు రోహిత్ శర్మ దూకుడు స్వభావాన్ని చూపాడు.
35
టీం మేనేజ్ మెంట్ కూడా అదే పంధా
ఇక టీం మేనేజ్‌మెంట్ కూడా అదే పంథాను ఫాలో అయింది. టీ20ల్లో టీమిండియా ఇప్పుడు పవర్‌ప్లేలోనే ప్రత్యర్థిపై పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఆ వ్యూహానికి అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లు సరిపోతారని అశ్విన్ చెప్పాడు.
గిల్‌కు టీం మేనేజ్‌మెంట్, సెలెక్టర్ల నుంచి పూర్తిగా సహకారం లభించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో వేగంగా ఆడలేకపోయాడని అశ్విన్ గుర్తు చేశాడు. గిల్ స్ట్రైక్ రేట్ 147.77 కాగా, సంజూ శాంసన్ 147.31గా ఉంది. స్ట్రైక్ రేటు విషయంలో పెద్దగా వ్యత్యాసం లేకపోయినప్పటికీ.. పరుగులు రాబట్టడంలో గిల్ విఫలమయ్యాడని తెలిపాడు.
55
శాంసన్ బెటర్..
గిల్ 36 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు చేయగా.. సంజూ శాంసన్ తక్కువ మ్యాచ్‌ల్లోనే మూడు సెంచరీలు సాధించాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో గిల్ గాయం కావడం, ఆఖరి మ్యాచ్‌లో సంజూ అద్భుతంగా రాణించడం కూడాగిల్ పతనానికి కారణమయ్యాయని అశ్విన్ వివరించాడు. ఏది ఏమైనా గిల్ ఆటతీరు జట్టు కాంబినేషన్‌ను దెబ్బతీస్తుందని, అతనిని పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగించలేదని అశ్విన్ పేర్కొన్నాడు.