Shubman Gill శకం ముగిసినట్టేనా? టీ20 జట్టులోకి ఆ కుర్రాడి ఎంట్రీతో షాక్ ! గుండె పగిలే నిజం !

Published : Jan 11, 2026, 04:08 PM IST

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో చోటు కోల్పోవడంపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మౌనం వీడారు. విధిరాతను ఎవరూ మార్చలేరంటూ సెలెక్టర్ల నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

PREV
16
టీ20 ప్రపంచ కప్ 2026 జట్టు నుండి అవుట్.. శుభ్‌మన్ గిల్ స్పందన ఇదే

ఐసీసీ మెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ పేరు లేకపోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్, పొట్టి ఫార్మాట్ ప్రపంచ కప్ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు గిల్ ఈ విషయంపై తొలిసారిగా తన మౌనాన్ని వీడారు.

26
మౌనం వీడిన శుభ్‌మన్.. ఏమన్నారంటే?

జనవరి 11 నుండి భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న తొలి వన్డేకి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో శుభ్‌మన్ గిల్ మాట్లాడారు. ప్రపంచ కప్ జట్టులో తన ఎంపిక జరగకపోవడంపై స్పందిస్తూ.. "నేను సెలెక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తాను. టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనబోయే భారత జట్టుకు నా శుభాకాంక్షలు. నేను ప్రస్తుతం ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. నా విధిలో ఏది రాసి పెట్టి ఉందో, దానిని ఎవరూ లాక్కోలేరు. ఒక ఆటగాడిగా ఎప్పుడూ దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే నా లక్ష్యం. సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వీకరిస్తున్నాను" అని గిల్ ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు.

36
గిల్ జట్టులో చోటు ఎందుకు కోల్పోయారు?

ఆసియా కప్ 2025 ద్వారా టీ20 జట్టులోకి పునరాగమనం చేసినప్పటికీ, గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. గత ఏడాది టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఆయన ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో జట్టులో ఉన్నప్పటికీ, పేలవమైన ఫామ్ కారణంగా వరల్డ్ కప్ స్క్వాడ్ నుండి ఉద్వాసన పలికారు. సెలెక్టర్లు టీమ్ కాంబినేషన్‌ను దృష్టిలో ఉంచుకుని గిల్ స్థానంలో అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

46
న్యూజిలాండ్ సిరీస్.. రోహిత్, కోహ్లీపైనే ఫోకస్

ప్రస్తుతం అందరి దృష్టి టీ20 ప్రపంచ కప్‌పై ఉన్నప్పటికీ, న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే అందరి కళ్లు ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 లీగ్ రౌండ్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు చెరో రెండు మ్యాచ్‌లు ఆడి భారీ స్కోర్లు సాధించారు. తమ ప్రభావం ఇంకా తగ్గలేదని వారు నిరూపించుకున్నారు. ఈ సిరీస్‌లో వీరిద్దరి ప్రదర్శన కీలకం కానుంది.

56
భారత తుది జట్టులో మార్పులు.. ఎవరికి ఛాన్స్?

వన్డే జట్టులోకి శుభ్‌మన్ గిల్ రాకతో తుది జట్టు కూర్పులో మార్పులు అనివార్యంగా మారాయి. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ తన తొలి వన్డే సెంచరీని నమోదు చేశారు. అయితే, టీమ్ మేనేజ్‌మెంట్ గిల్‌ను ఓపెనర్‌గా పంపాలని భావిస్తుండటంతో, జైస్వాల్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి రావొచ్చు.

మరోవైపు, శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో నంబర్-4 స్థానంలో బ్యాటింగ్ సమస్య తీరనుంది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ కొనసాగే అవకాశం ఉండటంతో, రిషబ్ పంత్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టంగా మారింది. బౌలింగ్ విభాగంలో బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినివ్వగా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా బాధ్యతలు పంచుకోనున్నారు.

66
గిల్ భవిష్యత్తు.. యువ ఆటగాళ్ల పోటీ

శుభ్‌మన్ గిల్ కెరీర్ ప్రస్తుతం కీలక మలుపులో ఉంది. టీ20 ఫార్మాట్‌లో ఆయన పునరాగమనం అంత సులభం కాదు. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్ల నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. గిల్ గణాంకాలు గమనిస్తే.. భారత టీ20 వైస్ కెప్టెన్‌గా గిల్ 15 మ్యాచ్‌లలో 24.25 సగటుతో 291 పరుగులు మాత్రమే చేశారు. స్ట్రైక్ రేట్ 137.26 మాత్రమే. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.

మరోవైపు సంజు శాంసన్ గత టీ20 ప్రపంచ కప్ తర్వాత 23 మ్యాచ్‌లలో 161.98 స్ట్రైక్ రేట్‌తో 588 పరుగులు చేశారు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. జట్టు మేనేజ్‌మెంట్ ప్రస్తుతం వికెట్ కీపర్-ఓపెనర్ ఫార్ములా వైపు మొగ్గు చూపుతోంది. ఇది జట్టుకు అదనపు బౌలర్ లేదా ఆల్ రౌండర్‌ను తీసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. గిల్ రాకతో ఈ ఆప్షన్ పోతుంది.

వైభవ్ సూర్యవంశీ వంటి 15 ఏళ్లలోపు కుర్రాడు ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టి అండర్-19 ప్రపంచ కప్‌కు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గిల్ కేవలం పరుగులు చేయడమే కాదు, సెలెక్టర్లు తనను విస్మరించలేని విధంగా అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. రాబోయే ఐపీఎల్‌లో గిల్ మెరుపులు మెరిపిస్తేనే పొట్టి ఫార్మాట్‌లో అతనికి భవిష్యత్తు ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories