Published : Oct 27, 2025, 08:09 PM ISTUpdated : Oct 27, 2025, 08:12 PM IST
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ కెరీర్ ప్రమాదంలో పడిందా అనే చర్చ మొదలైంది. అద్భుతమైన ఆటతో అదరగొడుతున్న అతను ఆస్ట్రేలియా పర్యటనలో గాయంతో ఐపీయూలో చేరాడు. అయ్యారుకు గాయం ఎలా అయింది? ఐసీయూలో చెరడానికి కారణం ఏంటి? మళ్లీ గ్రౌండ్ లో ఎప్పుడు అడుగుపెడతారు?
సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో 34వ ఓవర్ సమయంలో అలెక్స్ క్యారీ క్యాచ్ కోసం శ్రేయాస్ పరుగెత్తాడు. గాల్లోకి ముదుకు దూకి క్యాచ్ అందుకుని భారత జట్టుకు కీలక వికెట్ అందించాడు. కానీ నేలపై బలంగా పడటంతో అతని పక్కటెముకలో గాయం అయింది.
ఆ క్షణమే అయ్యర్ ముఖంలో కనిపించిన నొప్పి తీవ్రత ప్రేక్షకుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయ్యర్ పక్కటెముకలను పట్టుకుని గ్రౌండ్‌లోనే తీవ్రంగా బాధపడుతూ పడిపోయాడు. వైద్య సిబ్బంది సాయం లేకుండా నిలబడలేని పరిస్థితి కనిపించింది.
26
ఇంటర్నల్ బ్లీడింగ్ తో పెరిగిన గాయం తీవ్రత
స్కానింగ్ తరువాత స్ప్లీన్‌కు గాయం అయిందని నిర్ధారించారు. అదే ఇంటర్నల్ బ్లీడింగ్‌కి కారణమైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడ వచ్చాయి. ప్రమాదం తీవ్రతను గుర్తించిన వైద్యులు అతన్ని వెంటనే ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం కనీసం వారం రోజులు గట్టి పర్యవేక్షణలోనే కొనసాగించనున్నట్లు సమాచారం. ఇన్ఫెక్షన్ రాకుండా చూడటం ప్రధాన విషయంగా వైద్యులు పేర్కొంటున్నారు.
36
అయ్యర్ ఆరోగ్యం పై బీసీసీఐ ఏం చెప్పింది?
బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా తాజా అప్‌డేట్ ఇచ్చారు. “అయ్యర్ పరిస్థితి స్థిరంగా వుంది. సిడ్నీ నిపుణుల సూచనలతో చికిత్స జరుగుతోంది. భారత వైద్య బృందం రోజువారీ పురోగతిని అంచనా వేస్తుంది” అని తెలిపారు. అభిమానుల ఆందోళన తగ్గించే ప్రయత్నం చేస్తూనే, చికిత్స ఎంత కఠినంగా ఉందో ఈ ప్రకటనతో స్పష్టమైంది.
గాయం తీవ్రత తెలుసుకున్న తర్వాత అయ్యర్ తల్లిదండ్రులు తమ కొడుకును చూసేందుకు అత్యవసర వీసాల కోసం దరఖాస్తు చేశారు. బీసీసీఐ కూడా వారిని త్వరలో ఆస్ట్రేలియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వెంటనే కుటుంబం నుంచి ఎవరైనా అతని వద్ద ఉండేలా చర్యలు జరుగుతున్నాయి. అంటే గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉందనే విషయాన్ని ఈ పరిస్థితులు తెలుపుతున్నాయి. అతను మళ్లీ తిరిగి గ్రౌండ్ అగుడుపెట్టడానికి నెలలు పట్టే అవకాశముందని సమాచారం.
56
భారత జట్టుకు వెన్నెముకగా శ్రేయాస్ అయ్యర్
శ్రేయాస్ అయ్యర్ గాయంతో భారత మిడిల్ ఆర్డర్ వెన్నెముకగా ఉన్న ప్లేయర్ ను కోల్పోయింది. అయ్యర్ ఇటీవలి ఫామ్ గమనిస్తే.. ఈ సంవత్సరం 11 మ్యాచ్‌లలో 10 ఇన్నింగ్స్ ఆడి 496 పరుగులు సాధించాడు. 49.60 సగటు, 89.53 స్ట్రైక్ రేట్ తో అతని బ్యాటింగ్ కొనసాగింది. 5 హాఫ్ సంచరీలు కూడా సాధించాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ అయ్యర్. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అడిలైడ్ వన్డేలో రోహిత్‌తో సెంచరీ స్టాండ్ చేయడం అతని బ్యాటింగ్ స్థిరత్వానికి ఉదాహరణ.
66
గతంలోనూ గాయాలతో బాధపడ్డ అయ్యర్
తొడ, వెన్ను, భుజం… గతంలో కూడా ఇలాంటి గాయాలు శ్రేయాస్ అయ్యర్ ను క్రికెట్ కు దూరం చేశాయి. ఇప్పుడు స్ప్లీన్ గాయం కోలుకునే వరకు సిడ్నీలోనే ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది. రాబోయే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో ఆడతాడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
అయితే, కీలక సమయాల్లో జట్టుకు విలువైన ఆటగాడిగా నిలిచిన అయ్యర్ త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టాలని క్రికెట్ లవర్స్ తో పాటు యావత్ భారతావని కోరుకుంటోంది.
గెట్ వెల్ సూన్, శ్రేయాస్ అయ్యర్.. నీ ఆటకోసం ఎదురుచూస్తున్నాం !