Shikhar Dhawan Net Worth: టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అతని జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి ప్రవేశించింది.
శిఖర్ ధావన్-సోఫీ షైన్ వెడ్డింగ్: కొత్త జీవితాన్ని ప్రారంభించిన గబ్బర్
టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కారు. తన లాంగ్ టైమ్ పార్ట్‌నర్ సోఫీ షైన్‌ను శనివారం (ఫిబ్రవరి 21న) అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. గతేడాది మే నెలలో తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించిన ధావన్, ఈ ఏడాది జనవరి 12న ఇన్‌స్టాగ్రామ్ లో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించారు. అప్పటి నుంచి వీరిద్దరి పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
26
ఎవరీ సోఫీ షైన్?
శిఖర్ ధావన్ మనసు గెలుచుకున్న సోఫీ షైన్ ఐర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఆమె విద్యాభ్యాసం లిమరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో పూర్తయింది. ప్రస్తుతం ఆమె వృత్తిరీత్యా కార్పొరేట్ రంగంలో స్థిరపడ్డారు. సోఫీ అబుదాబిలోని నార్తర్న్ ట్రస్ట్ అనే ప్రముఖ సంస్థలో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన సోఫీ, ధావన్ జీవితంలోకి రావడం పట్ల నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
36
దుబాయ్‌లో మొదలైన ప్రేమాయణం
మీడియా కథనాల ప్రకారం, శిఖర్ ధావన్, సోఫీ షైన్ మొదటిసారి 2024లో దుబాయ్‌లో కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య మొదటి చూపులోనే ప్రేమ చిగురించినట్లు సమాచారం. తొలుత స్నేహితులుగా ఉన్న వీరు, ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమలో పడ్డారు. సోషల్ మీడియాలో ధావన్ చేసే ఫన్నీ రీల్స్‌లో కూడా సోఫీ అప్పుడప్పుడు కనిపిస్తూ అభిమానులను అలరించేవారు. సుమారు ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట, ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం గతంలో చాలా ఒడిదుడుకులకు లోనైంది. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని ఆయన గతంలో వివాహం చేసుకున్నారు. అయితే, 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ సమయంలో ధావన్ మానసికంగా చాలా కుంగిపోయారు. ముఖ్యంగా తన కుమారుడు జోరావర్‌ను ఆయేషా తనతో పాటు తీసుకెళ్లిపోవడంతో, కుమారుడికి దూరమైన బాధను ధావన్ పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఒంటరితనం, బాధ నుంచి కోలుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది.
56
క్రికెట్‌కు వీడ్కోలు.. గబ్బర్ కొత్త ప్రయాణం
టీమ్ ఇండియాలో సుదీర్ఘ కాలం పాటు ఓపెనర్‌గా సేవలందించిన ధావన్, 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. చాలా కాలంగా భారత జట్టులో చోటు దక్కకపోవడం, వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్, ఇతర లీగ్స్‌లో చురుగ్గా ఉంటూనే, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా తన అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇప్పుడు సోఫీ షైన్‌తో వివాహం తర్వాత ఆయన జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది.
66
రూ. 125 కోట్ల ఆస్తులు.. సోఫీ సంపాదన ఎంత?
ఆస్తుల విషయానికి వస్తే, శిఖర్ ధావన్ భారత ధనిక క్రికెటర్లలో ఒకరు. ధావన్ నికర ఆస్తి విలువ సుమారు 125 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. క్రికెట్ ద్వారా సంపాదించిన ఆదాయంతో పాటు, పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాల ద్వారా ఆయనకు భారీగా ఆదాయం వస్తుంది. ఇక సోఫీ షైన్ విషయానికి వస్తే, ఆమె కార్పొరేట్ రంగంలో నెలకు మంచి వేతనం అందుకుంటున్నారు. సోఫీ నికర ఆస్తి విలువ సుమారు 3 కోట్ల వరకు ఉంటుందని అంచనా.