మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రపంచ కప్ జట్టుపై తన అంచనాలను వెల్లడించారు. గిల్ వైస్ కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తం చేసిన చోప్రా, ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, గిల్‌ను ఓపెనర్‌గా జట్టులో కొనసాగించారు.
ఆకాష్ చోప్రా ఎంపిక చేసిన జట్టులో అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా వంటి వారు ఉన్నారు. సంజూ శాంసన్‌ను బ్యాకప్ ఓపెనర్, రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. వాషింగ్టన్ సుందర్ కూడా స్పిన్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. శనివారం జరగబోయే సమావేశంలో అజిత్ అగార్కర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.