స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు

Published : Dec 18, 2025, 07:59 PM IST

Auqib Dar: జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఆకిబ్ దార్‌ను ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఒకప్పుడు అండర్-19 ట్రయల్స్ కోసం స్నేహితుడి బూట్లు అడిగిన ఆకిబ్, ఇప్పుడు ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన..

PREV
15
వేలంలో భారీ ధర..

ఐపీఎల్ 2026 మినీ వేలం అబుదాబిలో ముగిసింది. అనేక మంది అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడై అదరగొట్టారు. వారిలో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఆకిబ్ దార్ ఒకరు. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆకిబ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడిని బేస్ ప్రైస్ కంటే 28 రెట్లు అధిక ధరకు సొంతం చేసుకుంది. ఒకప్పుడు అండర్-19 ట్రయల్స్ కోసం స్నేహితుడి బూట్లు అడుక్కున్న ఆకిబ్, ఇప్పుడు ఐపీఎల్ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లలో ఒకడిగా నిలిచారు.

25
జమ్మూ ఫాస్ట్ బౌలర్..

ఆకిబ్ దార్, జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా క్రేరీ గ్రామంలో జన్మించారు. 29 ఏళ్ల ఆకిబ్ తండ్రి గులాం నబీ దార్, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. నబీని డాక్టర్‌ను చేయాలనేది ఆయన కల. కానీ ఆకిబ్‌కు మాత్రం క్రికెట్ అంటే ప్రాణం. తండ్రికి ఇష్టం లేకున్నా, ఆకిబ్ తన అభిరుచిని వదులుకోలేదు. అండర్-19 కు ఎంపికైన తర్వాతే తండ్రికి పూర్తి నమ్మకం కలిగిందని ఆకిబ్ చెబుతున్నారు. సరైన క్రీడా మైదానాలు, శిక్షణా సౌకర్యాలు లేని ప్రాంతం నుండి వచ్చినా, పట్టుదలతో ఆకిబ్ ఎన్నో ప్రయత్నాల తర్వాత ఐపీఎల్‌కు ఎంపికయ్యారు. బారాముల్లాలో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయడానికి ఐపీఎల్ సహాయం చేస్తుందని ఆయన ఆశిస్తున్నారు.

35
అండర్ 19 ట్రయిల్స్ కోసం..

ఆకిబ్ నబీ అండర్-19 ట్రయల్స్ కోసం జమ్మూకు వెళ్ళినప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. బౌలింగ్ వేయడానికి స్పైక్స్ అవసరం అని అక్కడికి వెళ్ళాకే ఆయనకు తెలిసింది. అప్పటికే రూ. 500 స్పోర్ట్స్ షూస్ ధరించి వెళ్ళిన ఆకిబ్, అండర్-19లో ఆడిన తన స్నేహితుడిని స్పైక్స్ అడిగారు. స్నేహితుడు తన వద్ద ఉన్న మరో జత బూట్లను నబీకి ఇచ్చారు. ఆ తర్వాత ఆకిబ్ తన మొదటి మ్యాచ్ ఫీజుతో కొత్త స్పైక్స్ కొనుక్కున్నారు. ఇలా ఆకిబ్ దార్ క్రికెట్ ప్రస్థానం మొదలైంది.

45
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ గణాంకాలు

ఆకిబ్ దార్ 2020-21 రంజీ సీజన్‌లో జమ్మూ కాశ్మీర్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టారు. మొదట్లో ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉన్నా, గత రెండేళ్లుగా అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లతో పాటు 870 పరుగులు చేశారు. 2024 రంజీ సీజన్‌లో 13.93 సగటుతో 44 వికెట్లు తీశారు. 2025-26 రంజీ సీజన్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లలో 29 వికెట్లు పడగొట్టారు. అంతేకాకుండా, దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆకిబ్ సత్తా చాటారు. ఏడు మ్యాచ్‌లలో 15 వికెట్లు తీశారు.

55
బారాముల్లా డేల్ స్టెయిన్

ఆకిబ్ దార్ బౌలింగ్ శైలి దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్‌ను పోలి ఉంటుందని అంటుంటారు. అందుకే ఆయనను "బారాముల్లా డేల్ స్టెయిన్" అని పిలుస్తారు. గతంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ లాంటి ఐపీఎల్ జట్లు ఆకిబ్‌ను ట్రయల్స్ కోసం పిలిచినా, ఆయన స్థానం సంపాదించుకోలేకపోయారు. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పిలిచింది కానీ దేశవాళీ క్రికెట్ కారణంగా ట్రయల్స్‌లో పాల్గొనలేకపోయారు. బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే ఆకిబ్, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని, దాని కోసం ఎంత కష్టమైనా పడతానని చెబుతున్నారు. ఇప్పుడు ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు ఆకిబ్ దార్ సిద్ధంగా ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories