Sanju Samson Records : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన సునామీ నాక్ తో పలు హిస్టారికల్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
T20 World Cup 2026 Final లో సంజూ శాంసన్ రికార్డుల జాతర
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోరుకు పునాది వేశారు. ఈ క్రమంలో ఆయన ఐదు అద్భుతమైన రికార్డులను సృష్టించారు.
26
వరుసగా మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు
సంజూ శాంసన్ ఈ ప్రపంచ కప్‌లో అత్యంత నిలకడైన ఆటతీరును ప్రదర్శించారు. ముఖ్యంగా నాకౌట్ దశలో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్.. ఇలా వరుసగా మూడు కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించి రికార్డు సృష్టించారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో సెమీ ఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో షాహిద్ అఫ్రిది (2009), విరాట్ కోహ్లీ (2014) సరసన సంజూ చేరారు.
36
ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు
ఈ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు బాదడం ద్వారా సంజూ శాంసన్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా సంజూ (24 సిక్సర్లు) చరిత్ర సృష్టించారు. గతంలో ఫిన్ అలెన్ పేరిట ఉన్న 20 సిక్సర్ల రికార్డును ఆయన అధిగమించారు. రచిన్ రవీంద్ర వేసిన 13వ ఓవర్లో సంజూ వరుసగా మూడు సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించారు.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ కలిసి తొలి వికెట్‌కు విధ్వంసకర రీతిలో 98 పరుగులు జోడించారు. కేవలం 7.1 ఓవర్లలోనే వీరు ఈ స్కోరు సాధించడం విశేషం. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. గతంలో 2009లో శ్రీలంకపై పాకిస్థాన్ జంట కమ్రాన్ అక్మల్, షాజైబ్ హసన్ నెలకొల్పిన 48 పరుగుల రికార్డును వీరు బద్దలు కొట్టారు.
56
వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో 50+ స్కోర్లు
టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన కొద్దిమంది ఆటగాళ్లలో సంజూ ఒకరిగా నిలిచారు. మహేల జయవర్ధనే, విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం, కె.ఎల్. రాహుల్ వంటి దిగ్గజాల సరసన ఆయన చోటు సంపాదించుకున్నారు. సంజూ తన హాఫ్ సెంచరీని కేవలం 33 బంతుల్లోనే పూర్తి చేసుకున్నారు. ఈ టోర్నీలో ఆయన ఆటతీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
66
పవర్‌ప్లేలో టీమిండియా రికార్డ్ స్కోరు
సంజూ శాంసన్, అభిషేక్ శర్మల జోరుతో భారత్ పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పవర్‌ప్లేలో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. సంజూ తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే మాట్ హెన్రీ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్‌తో పరుగుల ఖాతా తెరిచారు. సంజూ శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులతో అదరగొట్టాడు. తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో కివీస్ బౌలర్లను హడలెత్తించాడు.