LSG: ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు ప్రదర్శన నానాటికీ దిగజారుతోంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి కంటే జట్టులోని అత్యంత ఖరీదైన ఆటగాళ్లైన రిషబ్ పంత్, నికోలస్ పూరన్..
బుధవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జైంట్స్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 146 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి లక్నో బ్యాటర్లు ఏమాత్రం నిలదొక్కుకోలేకపోయారు. లక్ష్య చేధనలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కోహ్లీ 34 బంతుల్లో 49 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆర్సీబీ కేవలం 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయం సాధించింది.
25
కోట్ల రూపాయలు వృధా.. పూరన్, పంత్ వైఫల్యాలు
లక్నో జట్టు యాజమాన్యం నికోలస్ పూరన్‌ను 21 కోట్లకు రిటైన్ చేసుకోగా, రిషబ్ పంత్‌ను చరిత్రలో అత్యధిక ధర అయిన 27 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే ఈ ఇద్దరి కోసమే 48 కోట్లు వెచ్చించింది. కానీ, వీరి ప్రదర్శన మాత్రం గల్లీ క్రికెట్ స్థాయిని మించడం లేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ చెరో ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు.
35
ఆడిన ఐదు మ్యాచ్‌లలో..
నికోలస్ పూరన్ ఈ సీజన్ లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడంటే ఆయన ఫామ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారీ ధర పలికిన రిషబ్ పంత్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పూర్తిగా విఫలమవుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చేసిన ఒక అర్ధ సెంచరీ మినహాయిస్తే, మిగిలిన మ్యాచ్‌లలో కనీసం రెండంకెల స్కోరు చేయడానికి కూడా కష్టపడుతున్నారు. ఆర్సీబీ మ్యాచ్‌లో పంత్ గాయపడటం, మళ్ళీ బ్యాటింగ్‌కు వచ్చినా పరుగులేమీ చేయకుండానే క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం గోయెంకాను మరింత నిరాశకు గురిచేసింది. అత్యధిక ధర చెల్లించినా, తన ప్రదర్శనలో 10 శాతం కూడా జట్టుకు అందించలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
55
ప్లే ఆఫ్స్ రేసులో వెనుకబడింది..
వరుస ఓటములతో లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్స్ రేసులో వెనుకబడుతోంది. ఇప్పటికైనా ఈ స్టార్ ఆటగాళ్లు పుంజుకోకపోతే, వచ్చే సీజన్ మెగా వేలంలో వారిని జట్టు వదులుకోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. సంజీవ్ గోయెంకా అసహనం చూస్తుంటే జట్టులో భారీ మార్పులు తప్పవనిపిస్తోంది.