Team India: ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ పొట్టి సిరీస్ కోసం టీమ్ ఇండియా కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ, యువ రక్తాన్ని బరిలోకి దింపాలని నిర్ణయించింది.
ఐర్లాండ్ పర్యటన కోసం ఎంపిక చేసే ఆటగాళ్ల జాబితాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కసరత్తు చేస్తోంది. ఐపీఎల్ తర్వాత నేరుగా ఇంగ్లాండ్ టూర్ ఉండే నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
25
మారనున్న బ్యాటింగ్ ఆర్డర్
ఐర్లాండ్ టూర్ లో టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ సరికొత్తగా కనిపించనుంది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్‌లు తొలి మూడు స్థానాల్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
35
ఐపీఎల్‌లో 250కి పైగా స్ట్రైక్ రేట్‌తో..
మిడిల్ ఆర్డర్‌లో శివమ్ దూబే, రజత్ పాటిదార్‌లతో పాటు కోల్‌కతా ఆటగాడు రఘువంశీకి కూడా సెలెక్టర్లు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో 250కి పైగా స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టిస్తున్న రజత్ పాటిదార్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది.
సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుండటంతో, ఐర్లాండ్ టూర్‌లో కొత్త నాయకత్వాన్ని పరీక్షించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నెలాఖరుకల్లా వీసాల ప్రక్రియ పూర్తి చేసి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. ఐపీఎల్‌లో రాణిస్తున్న కుర్రాళ్లకు అంతర్జాతీయ అనుభవం కల్పించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
55
ఐర్లాండ్‌లో ఎలాంటి అద్భుతాలు..
యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా ఐర్లాండ్‌లో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి. ముఖ్యంగా ఇషాన్ కిషన్ సారథ్యంలో ఈ యువ జట్టు సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.