IPL 2026: బ్యాటింగ్ చేయలేరు.. మళ్లీ వీరికి కెప్టెన్సీనా.? జట్టుకు భారంగా మారిన కెప్టెన్లు..

Published : Apr 17, 2026, 09:00 AM IST

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్నప్పటికీ, కొందరు స్టార్ కెప్టెన్ల పేలవ ప్రదర్శన ఆయా జట్లను, అభిమానులను కలవరపెడుతోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. 

PREV
15
రుతురాజ్ గైక్వాడ్ నిరాశాజనక ప్రదర్శన

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వెన్నుముకగా భావించే ఋతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ లో పూర్తిగా తడబడుతున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కేవలం ఏడు పరుగులకే వెనుదిరగడం ఆయన ఫామ్ లేమిని స్పష్టం చేస్తోంది. 

25
ఆడిన ఐదు మ్యాచ్‌లలో..

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో రుతురాజ్ కేవలం 63 పరుగులు మాత్రమే చేయగలిగారు. అందులోనూ మూడు ఇన్నింగ్స్‌లలో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం ఓపెనర్‌గా జట్టుకు భారంగా మారుతోంది. మేనేజ్మెంట్ ఆయనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో రుతురాజ్ విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

35
రిషబ్ పంత్ బాధ్యతారాహిత్యం

మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ఒక మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీ మినహాయిస్తే, మిగిలిన మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి పంత్ కేవలం 35 పరుగులు మాత్రమే చేయగలిగారు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయంలో అనవసరమైన షాట్లకు ప్రయత్నిస్తూ వికెట్ పారేసుకోవడం జట్టుకు ప్రతిబంధకంగా మారింది. అయితే లక్నో బౌలింగ్ విభాగం బలంగా ఉండటం వల్ల జట్టు విజయాలు సాధిస్తోంది. తద్వారా పంత్ వ్యక్తిగత వైఫల్యాలు ప్రస్తుతానికి లైంలైట్‌లోకి రావట్లేదు.

45
కెప్టెన్సీ మార్పుపై ఊహాగానాలు

వరుస వైఫల్యాలు ఇలాగే కొనసాగితే ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ల కెప్టెన్సీపై వేటు పడే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్ తన ప్రదర్శనను మెరుగుపరుచుకోకపోతే, సీఎస్కే మేనేజ్మెంట్ సంజూ శాంసన్ వంటి సీనియర్లకు సారథ్య బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు గల్లీ క్రికెట్ స్థాయి ప్రదర్శన ఇవ్వడంపై అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

55
ముందుండి నడిపించడం ముఖ్యం..

ఏ జట్టుకైనా కెప్టెన్ ముందుండి నడిపించడం ముఖ్యం. రుతురాజ్, పంత్ తక్షణమే తమ ఫామ్‌ను అందుకోకపోతే, అది కేవలం వారి వ్యక్తిగత రికార్డులనే కాకుండా జట్టు ప్లేఆఫ్ అవకాశాలను కూడా దెబ్బతీస్తుంది. రాబోయే మ్యాచ్‌లలో వీరు ఎలా పుంజుకుంటారో వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories