Ruturaj Gaikwad: టీమిండియా యువ సంచలనం రుతురాజ్ గైక్వాడ్ లిస్ట్ ఏ క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అత్యధిక సగటుతో కోహ్లి, పుజారా వంటి దిగ్గజాలను అధిగమించి భారత్ తరఫున అగ్రస్థానంలో నిలిచాడు.
టీమిండియా యంగ్ సెన్సేషన్ రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్, దేశవాళీ మ్యాచుల్లోనూ, అంతర్జాతీయ వేదికల పైన తన పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రుతురాజ్ ఒక సరికొత్త సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన టీం ఇండియా ఆటగాడిగా అవతరించాడు.
25
కోహ్లీని వెనక్కి నెట్టి..
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో అజేయ అర్ధ సెంచరీతో రాణించి ఈ ఘనత సాధించాడు రుతురాజ్ గైక్వాడ్. తాజా ఇన్నింగ్స్ తర్వాత గైక్వాడ్ లిస్ట్ ఏ సగటు ఏకంగా 57.80 కి చేరింది. దీంతో అతను భారత టెస్ట్ స్పెషలిస్ట్ చేతేశ్వర్ పుజారాను అధిగమించి ఈ ఫార్మాట్‌లో అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, ఈ జాబితాలో పుజారా, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు రుతురాజ్ కంటే వెనుకబడి ఉన్నారు.
35
అరుదైన రికార్డు సొంతం..
కేవలం భారత ఆటగాళ్ళ మధ్యనే కాకుండా, ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ళ జాబితాలోనూ రుతురాజ్ స్థానం అగ్రభాగాన ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆస్ట్రేలియా వైట్ బాల్ దిగ్గజం మైఖేల్ బేవాన్ మాత్రమే 57.86 సగటుతో అగ్రస్థానంలో ఉన్నాడు. బేవాన్ రుతురాజ్ కంటే స్వల్ప ఆదిక్యంలో ముందున్నాడు. అంటే, లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక సగటు రుతురాజ్ దే కావడం భారత్ క్రికెట్‌కు గర్వకారణం అని చెప్పొచ్చు.
లిస్ట్ ఏ క్రికెట్‌లో రుతురాజ్ ప్రదర్శన అసాధారణమైనది. ఇప్పటివరకు ఆడిన 85 ఇన్నింగ్స్‌లలో 17 శతకాలు, 18 అర్ధ శతకాల సహాయంతో అతను ఏకంగా 4500 కు పైగా పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఏకంగా 220 నాటౌట్. రుతురాజ్ కేవలం వేగంగా ఆడడమే కాదు, స్థిరంగా క్రీజ్‌లో నిలబడి భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఉన్న ఆటగాడు.
55
సెలెక్టర్లకు మెసేజ్..
రుతురాజ్ గైక్వాడ్ కేవలం రికార్డుల కోసమే ఆడడం లేదు. భారత జట్టులో స్థానం కోసం గట్టి పోటీనిస్తున్నాడు. ఈ అద్భుతమైన ఫామ్ అతన్ని టీం ఇండియా వన్డే, టి20 జట్టులో ఓపెనర్ స్థానానికి బలమైన పోటీదారుగా నిలబెట్టే అవకాశం లేకపోలేదు. ముందు ముందు టీం ఇండియా ఆడే ముఖ్యమైన సిరీస్‌లలో గైక్వాడ్ సేవలు తప్పనిసరిగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.