Rohit Breaks Kohli's Record : సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో దుమ్మురేపాడు. ఆస్ట్రేలియాలో సందర్శక బ్యాటర్‌గా అత్యధిక సెంచరీ రికార్డును నమోదుచేశాడు. ఈ నాక్ తో ఇండియాకు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సిడ్నీలో శనివారం జరిగిన భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డేలో భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడుతూ, ఆ దేశంలో తన ఆరో వన్డే సెంచరీని నమోదు చేశాడు. దీంతో ఆస్ట్రేలియాలో సందర్శక బ్యాటర్‌గా అత్యధిక సెంచరీల రికార్డులో రోహిత్ మరో ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. అంతకుముందు 5 సెంచరీలతో విరాట్ కోహ్లీ, శ్రీలంక బ్యాటర్ కుమార సంగక్కరలతో సమానంగా ఉన్నాడు. ఇది రోహిత్ వన్డే కెరీర్‌లో 33వ సెంచరీ.
ఆస్ట్రేలియాలో సందర్శక బ్యాటర్ల వన్డే సెంచరీ రికార్డులు
6 - రోహిత్ శర్మ (33 ఇన్నింగ్స్ లు)
5 - విరాట్ కోహ్లీ (32 ఇన్నింగ్స్ లు)
5 - కుమార సంగక్కర (49 ఇన్నింగ్స్ లు)
రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా కూడా సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేశాడు. ఇద్దరూ ఇప్పటివరకు తొమ్మిదేసి సెంచరీలు సాధించారు.
25
రోహిత్-కోహ్లీ ఆధిపత్యంతో భారత్ ఘన విజయం
ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో రాణించడంతో ఆస్ట్రేలియాను 236 పరుగులకే ఆలౌట్ అయింది. 237 పరుగుల లక్ష్యఛేదనలో రోహిత్ శర్మ (121 నాటౌట్), విరాట్ కోహ్లీ (74 నాటౌట్) రెండో వికెట్‌కు 170 బంతుల్లో 168 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌ను 38.3 ఓవర్లలో 237/1కు చేర్చారు. సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో గెలుచుకున్నప్పటికీ, సిడ్నీ ప్రేక్షకుల మధ్య రోహిత్-కోహ్లీ ప్రత్యేక ఇన్నింగ్స్‌ను ఆడారు.
35
రోహిత్ 50వ ఇంటర్నేషనల్ సెంచరీ రికార్డు
ఈ సెంచరీ రోహిత్ కెరీర్‌లో 50వ ఇంటర్నేషనల్ సెంచరీ. దీంతో 50+ అంతర్జాతీయ సెంచరీలు చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు.
భారత బ్యాటర్ల ఇంటర్నేషనల్ సెంచరీ రికార్డులు
1. సచిన్ టెండుల్కర్ - 100 సెంచరీలు
2. విరాట్ కోహ్లీ - 82
3. రోహిత్ శర్మ - 50
అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సెంచరీలు చేసిన ప్రపంచ టాప్-10 జాబితాలో రోహిత్ పదో స్థానంలోకి చేరాడు.
డబుల్ డక్ తర్వాత ఈ మ్యాచ్‌లో కోహ్లీ 74 పరుగులతో నాటౌట్‌గా తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. తన ఇన్నింగ్స్ లో పలు రికార్డులు సాధించాడు. 32వ ఓవర్‌లో సంగక్కరను అధిగమించి, వన్డేల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. రోహిత్‌తో కలిసి 100+ రన్స్ భాగస్వామ్యం 19వ సారి నమోదు చేశాడు.
55
ఆస్ట్రేలియా బ్యాటింగ్ కష్టాలు
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు రాణించడంతో 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాట్ రెన్షా 56, కెప్టెన్ మిచెల్ మార్ష్ 41 పరుగులతో పోరాడారు. హర్షిత్ రానా 4/39 వికెట్లతో భారత్‌కు కీలక విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా పెద్ద స్కోర్ దిశగా సాగుతుండగా, భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు.