టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలో మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ జాగ్రత్తగా ఆరంభించారు. అయితే 61 పరుగుల వద్ద హెడ్ 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత భారత స్పిన్నర్లు ఆధిపత్యం చూపించారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రన్స్ రాకుండా అడ్డుకున్నారు. అక్షర్ పటేల్, మార్ష్‌ను 49 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆతిథ్య జట్టు ఒత్తిడిలో పడింది. క్యారీ, రెన్షా త్వరగా వెనుదిరగడంతో 183/3 నుంచి 195/5కి పడిపోయింది.
హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో 4 వికెట్లు తీశాడు. నాథన్ ఎలిస్, మిచెల్ స్టార్క్ సహా టెయిలెండర్లను ఔట్ చేస్తూ ఆస్ట్రేలియాను 46.3 ఓవర్లలో 236 పరుగులకు పరిమితం చేశాడు.