Rohit Sharma, Virat Kohli : ఏమిటీ.. నిజంగానే ఈ దిగ్గజ క్రికెటర్ల వన్డేలకూ గుడ్ బై చెబుతారా? బిసిసిఐ క్లారిటీ

Published : Jul 16, 2025, 04:01 PM IST

టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్, టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడానికి బిసిసిఐ ఒత్తిడే కారణమా? ఇప్పుడు వన్డేల నుండి కూడా తప్పించాలని చూస్తున్నారా? వారి రిటైర్మెంట్ పై తాజాగా బిసిసిఐ క్లారిటీ ఇచ్చింది.

PREV
15
రోహిత్, కోహ్లీ వన్డేల నుండి రిటైర్ అవుతారా?

Rohit Sharma, Virat Kohli : భారత క్రికెట్ జట్టు ఇప్పుడు యువకులతో నిండివుంది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సీరిస్ కు యువ సంచలనం శుభ్ మన్ గిల్ సారథ్యం వహిస్తున్నారు... రవీంద్ర జడేజా, బుమ్రా వంటి కొందరు మినహా మిగతావారంతా యువకులే. చాలామంది ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించారు. 

 ఇక భారత టీ20 టీమ్ కు కూడా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కేవలం వన్డేలకు మాత్రమే సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడుతోంది టీమిండియా.

అయితే ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్స్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డేలకు కూడా గుడ్ బై చెబుతాడనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మరో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా టెస్ట్, టీ20 ల నుండి రిటైరయ్యారు... రోహిత్ లాగే వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈక్రమంలో ఇతడు కూడా వన్డేల నుండి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది.

25
రోహిత్, కోహ్లీ తప్పుకుంటున్నారా? తప్పిస్తున్నారా?

రాబోయే వన్డే, టీ20 వరల్డ్ కప్స్ కోసం ఇప్పటినుండే భారత జట్టును సిద్దం చేయాలని ప్లాన్ చేస్తోంది బిసిసిఐ. ఈ క్రమంలోనే సీనియర్లను తప్పించి యువకులకు మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు సిద్దమయ్యిందట... అందుకే రోహిత్, కోహ్లీలపై బిసిసిఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్) ఒత్తిడి పెంచుతోందనే ప్రచారం సాగుతోంది. దీంతో ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు గౌరవప్రదంగానే అంతర్జాతీయ క్రికెట్ నుండి పూర్తిగా వైదొలిగేందుకు సిద్దమైనట్లు క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

35
రోహిత్, కోహ్లీ నిజంగానే వన్డేలకు గుడ్ బై చెబుతారా?

టెస్ట్. టీ20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్ ఇక ముగిసినట్లేనని అందరూ భావించారు. సరైన సందర్భం చూసుకుని వన్డేల నుండి కూడా తప్పుకుంటారని... టీమిండియా భవిష్యత్ ఇక యువకుల చేతుల్లోనే ఉందని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. అందువల్లే ప్రతిసారి రోహిత్, కోహ్లీ వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ పర్యటనకు ముందే రోహిత్, కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికారు. అలాగే గతేడాది టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత ఈ ఇద్దరూ టీ20 ఫార్మాట్ నుండి కూడా రిటైర్ అయ్యారు. రోహిత్, కోహ్లీ రెండు ఫార్మాట్ల నుంచి నిష్క్రమించడంతో వన్డేల్లో వారి భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తాయి.

టెస్టుల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటిస్తూ రోహిత్ వన్డేలు ఆడతానని చెప్పారు. కోహ్లీ 2027 ప్రపంచకప్ ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయినప్పటికి వీరు వన్డేలనుండి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రచారం మాత్రం ఆగడంలేదు.

45
రోహిత్, కోహ్లీ వన్డేలు ఆడతారా?

వన్డేల్లో రోహిత్, కోహ్లీ భవిష్యత్ పై ఊహాగానాల నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టతనిచ్చారు. ఇద్దరూ టెస్ట్, టీ20 ఫార్మాట్స్ నుండి తప్పుకున్నా వన్డేల్లో మాత్రం ఆడతారని ఆయన తెలిపారు.

“వారిద్దరూ(రోహిత్, కోహ్లీ) లెజెండరీ బ్యాటర్లు. వన్డేలకు అందుబాటులో ఉండటం మాకు చాలా మంచిది” అని రాజీవ్ శుక్లా అన్నారు.

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై గెలిచిన మ్యాచే రోహిత్, కోహ్లీ చివరిసారిగా ఆడిన వన్డేలు. ఈ టోర్నీలో రోహిత్ ఐదు మ్యాచ్‌ల్లో 180 పరుగులు చేశాడు. కోహ్లీ 218 పరుగులతో ఈ టోర్నీలోనే రెండో స్థానంలో నిలిచాడు.

2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమ్ ఇండియా బలమైన జట్టును నిర్మించుకోవాలని చూస్తోంది. రోహిత్, కోహ్లీ అనుభవం, మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం జట్టుకు కీలకం కానుంది. అందుకే వారిని కొనసాగిస్తారన్న ప్రచారం కూడా మరోవైపు జరుగుతోంది. 

55
రోహిత్, కోహ్లీలను బలవంతంగా రిటైర్ చేయించారా?

రోహిత్, కోహ్లీ స్వచ్ఛందంగా టెస్టుల నుంచి రిటైర్ అయినప్పటికీ... యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు వారిని బలవంతంగా రిటైర్ చేయించారనే ఊహాగానాలు వెలువడ్డాయి. లార్డ్స్ టెస్ట్ ఓటమి తర్వాత ఈ ఊహాగానాలు మరింత వ్యాపించాయి. అయితే రోహిత్, కోహ్లీ స్వచ్ఛందంగానే రిటైర్ అయ్యారని... ఆటగాళ్లను రిటైర్ కమ్మని చెప్పే హక్కు బోర్డుకు లేదని రాజీవ్ శుక్లా అన్నారు.

“రోహిత్, కోహ్లీ లేకపోవడం మాకు బాధగానే ఉంది. కానీ వారు స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు” అని శుక్లా అన్నారు. “ఏ ఆటగాడు ఎప్పుడు, ఏ ఫార్మాట్ నుంచి రిటైర్ కావాలో మేం చెప్పం. అది ఆటగాళ్ల ఇష్టం. రోహిత్, కోహ్లీ గొప్ప బ్యాటర్లు. వారిని మిస్ అవుతాం” అని ఆయన అన్నారు.

రోహిత్ టెస్టుల్లో 4301 పరుగులు చేశాడు...ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లీ 9230 పరుగులు చేసాడు.. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories