టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఇవే

Published : Nov 26, 2025, 06:08 PM IST

India : గువాహటి టెస్ట్‌లో భారత్ 408 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పతనం, బౌలింగ్ లోపాలు, రెండో ఇన్నింగ్స్ విఫలం ఇలా భారత్ జట్టు ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఇండియా vs సౌతాఫ్రికా: భారత్ ను దెబ్బకొట్టిన అంశాలు

గువాహటి టెస్ట్‌లో భారత్ ప్రారంభ దశలలో ఆధిక్యాన్ని సంపాదించినట్టు కనిపించినా, కీలక సమయాల్లో కుప్పకూలడంతో భారీ పరాజయం తప్పలేదు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 247/6 పరుగుల స్థితి నుంచి 489 పరుగులు చేయగలిగింది. సెనురాన్ ముత్తుసామి, మార్కో జాన్సెన్ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి మ్యాచ్‌ను భారత చేతుల్లోంచి లాగేసుకున్నారు.

భారత్ అదే ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే ఆగిపోయింది. తర్వాత దక్షిణాఫ్రికా 260/5 డిక్లేర్ చేసి భారత్‌కు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నాల్గో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ మరోసారి ఘోరంగా విఫలమై 140 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 408 పరుగుల తేడా అంటే భారత్ టెస్ట్ చరిత్రలో రన్స్ పరంగా అతిపెద్ద పరాజయం అందుకుంది.

25
కీలక సమయంలో బ్యాటింగ్ కుప్పకూలింది

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కు మంచి ఆరంభం లభించింది. స్కోరు 65/0 వద్ద ఉన్న సమయంలో జరిగిన తప్పిదాలతో పెద్ద స్కోర్ ను సాధించలేకపోయింది. జాన్సెన్ వేగం, బౌన్స్, ఖచ్చితత్వంతో కూడిన బౌలింగ్ తో భారత్ ను దెబ్బకొట్టాడు. దీంతో 122/7 స్థితికి చేరుకుంది. ఆ తర్వాత కూడా భారత్ ఎక్కువ సేపు గ్రౌండ్ నిలవలేకపోయింది.

నాల్గో ఇన్నింగ్స్‌లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. సైమన్ హార్మర్ స్పిన్‌కు భారత్ సమాధానం చెప్పలేకపోయింది. టాప్, మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు చాలా త్వరగా పెవిలియన్ కు చేరారు. జడేజాతో పాటు మరికొందర్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల నుండి మాత్రమే ప్రతిఘటన వచ్చింది. కానీ, తర్వాతగానే వికెట్లు కోల్పోయి భారత్ 140 పరుగుల వద్ద కుప్పకూలింది.

35
భారత జట్టులో బౌలింగ్ లోపాలు, టాక్టికల్ వైఫల్యం

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 247/6 నుంచి 489 పరుగులు చేయడం భారత బౌలింగ్ వైఫల్యానికి నిదర్శనం. జాన్సెన్, ముత్తుసామి భాగస్వామ్యం సమయంలో భారత సీమ్ బౌలర్లు లెంగ్త్, లైన్ క్రమశిక్షణ కోల్పోయారు. బౌలర్ల వ్యూహాలు పనిచేయలేదు.

ఫీల్డింగ్‌లో కూడా తప్పిదాలు జరిగాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ లోపాలు, క్యాచ్ లు మిస్ చేయడం భారత పై ఒత్తిడిని మరింత పెంచింది. దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం పొందే అవకాశం లభించింది.

45
భారత జట్టు ఎంపిక లోపాలు, అనుభవలేమి, తీవ్ర ఒత్తిడి

భారత్ ఈ మ్యాచ్‌లో తక్కువ అనుభవం ఉన్న జట్టుతో ఆడింది. కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ వంటి కొద్దిమంది మాత్రమే అనుభవజ్ఞులు. ముఖ్యమైన దశల్లో ఒత్తిడిని తట్టుకునే సమర్థత ఉన్న ప్లేయర్లు పెద్దగా జట్టులో కనిపించలేదు.

మ్యాచ్ అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా టీమ్ ఎదుర్కొన్న పరిస్థితులను గురించి స్పష్టంగా చెప్పారు. ఒత్తిడిని ఎదుర్కొనే సామర్ధ్యం లోపించిందని ఆయన పేర్కొన్నారు.

 విమర్శకులు టాక్టికల్ గందరగోళాన్ని, స్పెషలిస్టులు, ఆల్‌రౌండర్ల మధ్య సమతుల్యం లోపాన్ని ప్రస్తావించారు. సిరీస్ మొత్తం భారత బ్యాటింగ్‌లో ఆత్మవిశ్వాసం తగ్గిపోయినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కోచ్ గంభీర్, సెలక్షన్ కమిటీ నిర్ణయాలు కూడా కారణంగా మారాయని పేర్కొంటున్నారు.

55
భారత జట్టు ఓటమి కారణాల్లో గంభీర్ కూడా

ఈ గువాహటి టెస్ట్‌లో భారత్ ఎదుర్కొన్న పరాజయం ఒక్క కారణంతో జరిగినది కాదు. వివిధ అంశాలు మ్యాచ్ ను ప్రభావితం చేశాయి. ఈ భారీ ఓటమికి దారితీసిన కారణాలు..

  • తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన బ్యాటింగ్
  • జాన్సెన్–ముత్తుసామి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయలేకపోవడం
  • కీలక క్యాచ్‌లు మిస్ చేయడం
  • నాల్గో ఇన్నింగ్స్‌లో స్పిన్‌కు ఎదురునిలవలేకపోవడం
  • అస్థిర జట్టు కూర్పు
  • ఒత్తిడిలో తప్పుడు నిర్ణయాలు
  • పనిచేయని గంభీర్ వ్యూహాలు, ప్రయోగాలు 

మొత్తంగా భారత్ అన్ని విభాగాల్లో దక్షిణాఫ్రికా కంటే వెనుకబడింది. అందుకే భారీ తేడాతో ఓడిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories