మాజీ ఆటగాళ్లు టీమిండియా ఆట తీరుపై నిరాశను వ్యక్తం చేస్తూ గంభీర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణం కోచ్ నిర్ణయాలే అంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు.
వరుస వైట్‌వాష్‌లు, వరుస టెస్టు సిరీస్ వైఫల్యాలు, సీనియర్ల తప్పుకోవడం, జట్టులోని అంతర్గత సమస్యలు.. ఇన్నీ కూడి ఇప్పుడు బీసీసీఐ దృష్టి కోచ్ గంభీర్ వైపు మళ్లింది. సోషల్ మీడియాలో ఇదే గంభీర్‌కు చివరి టెస్టు అనే చర్చ మొదలైంది.
గత 15 నెలల్లో వన్డేలు, టెస్టుల్లో భారత్ ఎదుర్కొన్న పరాజయాలు, అనేక వివాదాస్పద సెలక్షన్ నిర్ణయాలతో ఏర్పడిన ఈ పరిస్థితులను మార్చడానికి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్, మాజీ ప్లేయర్లు పేర్కొంటున్నారు.