చెన్నైకి శాంసన్, హైదరాబాద్‌కు తిలక్.. ఒరేయ్ అజామూ.! ట్రేడ్స్ చూస్తే దిమ్మతిరిగిపోతోంది

Published : Nov 10, 2025, 11:00 AM IST

IPL 2026: ఐపీఎల్ 2026 ఆక్షన్ డిసెంబర్ 15న జరగనుండగా, రిటెన్షన్ డెడ్‌లైన్ నవంబర్ 15గా ఉంది. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌ను వీడటం ఖాయంగా కనిపిస్తోంది. పలు జట్లు అతడి కోసం పోటీ పడుతున్నాయి. ఇషాన్ కిషన్ భవిష్యత్తుపై కూడా సందిగ్ధత నెలకొంది.

PREV
15
రిటైన్ లిస్టు డెడ్ లైన్..

ఐపీఎల్ 2026 ఆక్షన్ కోసం ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. డిసెంబర్ 15న జరిగే ఈ కీలక ఆక్షన్ ముందుగా నవంబర్ 15న రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్‌ల జాబితాను బీసీసీఐకి సమర్పించనున్నాయి ఫ్రాంచైజీలు. ఈ క్రమంలోనే ఆయా జట్లలోని ప్రధాన ఆటగాళ్ల ట్రేడ్స్‌పై పలు రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

25
సంజూ కోసం చెన్నై పోటీ

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఐపీఎల్ 2026లో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించకపోవడం దాదాపు ఖాయమని తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ గతంలో స్టబ్స్‌ను ఇచ్చి సంజు శాంసన్‌ను కోరినప్పటికీ, ఆ ట్రేడ్ కార్యరూపం దాల్చలేదు. తాజాగా, చెన్నై సూపర్ కింగ్స్ కూడా సంజు కోసం రాజస్థాన్ రాయల్స్‌ను సంప్రదించిందని సమాచారం.

35
చెన్నైతో సంజూ డీల్

చెన్నై జట్టుతో డీల్ దాదాపుగా కుదిరిందని టాక్. సంజూకు బదులుగా రవీంద్ర జడేజా, మతీశ పతిరన, రుతురాజ్ గైక్వాడ్ వంటి కీలక ఆటగాళ్లను ట్రేడ్‌ చేసేందుకు చెన్నై సిద్దంగా ఉందట. మరోవైపు, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ భవితవ్యంపై ఇంటర్నెట్‌లో పలు రూమర్స్ బాగా వినిపిస్తున్నాయ్.

45
ఇషాన్ కోసం ఆ రెండు ఫ్రాంచైజీలు..

ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ సహా పలు ఫ్రాంచైజీలు ఇషాన్ కిషన్ కోసం ప్రయత్నిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ క్లాసెన్‌ను రిలీజ్ చేస్తే ఇషాన్ కిషన్‌ను రిటైన్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా కాకుండా ఇషాన్ కిషన్ కోసం ముంబై, హైదరాబాద్ మధ్య ట్రేడ్ జరిగితే.. తిలక్ వర్మను ఎస్ఆర్హెచ్‌కు ఇచ్చి ఇషాన్ కిషన్‌ను తీసుకోవడం మంచి డీల్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

55
కీలక ప్లేయర్స్ కోసం SRH పోటీ..

సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులో ఒక మంచి ఫినిషర్, ఒక నాణ్యమైన స్పిన్నర్ కోసం చూస్తున్నట్లు సమాచారం. వరుణ్ చక్రవర్తి లేదా రింకూ సింగ్‌లను ట్రేడ్ ద్వారా పొందాలని SRH ప్లాన్ చేస్తోందట. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాడు ఏ జట్టుకైనా చాలా కీలకం. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని 100 శాతం రిలీజ్ చేయదని అంచనా.

Read more Photos on
click me!

Recommended Stories