IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !

Published : Dec 22, 2025, 05:06 PM ISTUpdated : Dec 22, 2025, 05:22 PM IST

RCB : ఆర్సీబీ కొత్త బౌలర్ జాకబ్ డఫీ అంతర్జాతీయ క్రికెట్‌లో 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. 2025లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి చరిత్ర సృష్టించారు. దీంతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

PREV
16
జస్ప్రీత్ బుమ్రా, స్టార్క్‌లను వెనక్కి నెట్టిన ఆర్సీబీ కొత్త బౌలర్.. రికార్డుల మోత!

అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. అయితే కొన్ని రికార్డులు మాత్రం దశాబ్దాల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. అటువంటి ఒక అరుదైన రికార్డును న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ జాకబ్ డఫీ బద్దలు కొట్టాడు. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ (RCB) జట్టులో చేరిన ఈ బౌలర్, ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ బౌలర్లను వెనక్కి నెట్టి, వికెట్ల వేటలో అగ్రస్థానంలో నిలిచాడు.

26
బుమ్రా, స్టార్క్ వంటి టాప్ బౌలర్లను దాటేసిన జాకబ్ డఫీ

సాధారణంగా క్రికెట్ అభిమానులు 2025 సంవత్సరంలో బౌలింగ్ విభాగంలో సత్తా చాటిన బౌలర్ ఎవరు ప్రశ్నవస్తే ముందుగా జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్ లేదా ప్యాట్ కమిన్స్ పేర్లు వస్తాయి. కానీ గణాంకాలు మాత్రం వేరే కథను చెబుతున్నాయి. ఈ ఏడాది బౌలింగ్‌లో అసలైన హీరోగా జాకబ్ డఫీ నిలిచాడు.

ప్రపంచస్థాయి బౌలర్లైన బుమ్రా, స్టార్క్, కమిన్స్ వంటి వారిని కూడా డఫీ వెనక్కి నెట్టాడు. 2025 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జాకబ్ డఫీ అవతరించారు. ఈ ప్రదర్శనతో ఆయన తన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాడు.

36
ఆర్సీబీకి కలిసొచ్చిన జాకబ్ డఫీ ఫామ్

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జరిగిన మినీ వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన జాకబ్ డఫీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. ఈ వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ డఫీని అతని బేస్ ప్రైస్ అయిన రూ. 2 కోట్లకు దక్కించుకుంది.

జట్టులో ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఉన్నారు. ఆయనకు బ్యాకప్‌గా జాకబ్ డఫీని జట్టులోకి తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం డఫీ ఉన్న ఫామ్ చూస్తుంటే, ఆయనను కేవలం బ్యాకప్ బౌలర్‌గా చూడటం సరికాదు. ఈ ఏడాది ఆయన చేసిన ప్రదర్శనను ఎవరూ అంత తేలికగా తీసిపారేయలేరు. 31 ఏళ్ల ఈ పేసర్ చేసిన ప్రదర్శన ఇప్పుడు ఆర్సీబీ అభిమానుల్లో మరిన్ని ఆశలు రేపుతోంది.

46
40 ఏళ్ల నాటి రికార్డు బద్దలు

జాకబ్ డఫీ కేవలం 2025లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మాత్రమే నిలవలేదు. ఆయన న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే ఒక సుదీర్ఘమైన రికార్డును తిరగరాశాడు. కివీస్ మాజీ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ పేరిట ఉన్న 40 ఏళ్ల నాటి రికార్డును డఫీ బద్దలు కొట్టాడు.

రిచర్డ్ హ్యాడ్లీ 1985 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 79 వికెట్లు పడగొట్టాడు. ఇన్నాళ్లుగా ఈ రికార్డు పదిలంగా ఉంది. అయితే, 2025లో జాకబ్ డఫీ అద్భుతమైన బౌలింగ్‌తో హ్యాడ్లీ కంటే రెండు వికెట్లు ఎక్కువగా సాధించి, కొత్త చరిత్ర లిఖించాడు. క్రికెట్ జగత్తులో ఇది ఒక సంచలన విషయంగా మారింది.

56
2025లో జాకబ్ డఫీ గణాంకాలు

ఈ ఏడాది జాకబ్ డఫీ గణాంకాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 2025 సంవత్సరంలో అత్యంత విజయవంతమైన బౌలర్ ఆయనే. ఈ కుడిచేతి వాటం పేసర్ ఈ ఏడాది మొత్తం 36 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో ఏకంగా 81 వికెట్లు పడగొట్టాడు.

ఆయన ఆధిపత్యం ఎంతలా ఉందో చెప్పడానికి ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న బౌలర్ల గణాంకాలే నిదర్శనం. జాకబ్ డఫీ తర్వాత స్థానంలో న్యూజిలాండ్‌కే చెందిన మ్యాట్ హెన్రీ, జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీ ఉన్నారు. వీరిద్దరూ తలో 65 వికెట్లు మాత్రమే తీయగలిగారు. అంటే మొదటి స్థానానికి, రెండవ స్థానానికి మధ్య ఏకంగా 16 వికెట్ల అంతరం ఉండటం గమనార్హం.

66
ఐపీఎల్ 2026 : ప్లేయింగ్ 11 లో అవకాశం దక్కేనా?

ఈ అద్భుతమైన ఫామ్‌తో జాకబ్ డఫీ మొదటిసారిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే, ఆర్సీబీ యాజమాన్యం ఆయనను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆర్సీబీ తుది జట్టులో అతనికి చోటు దక్కుతుందో లేదో చూడాలి.

జాకబ్ డఫీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 156 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 24.33 సగటుతో మొత్తం 178 వికెట్లు సాధించాడు. ఇక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయానికి వస్తే, ఆయన ఖాతాలో 53 వికెట్లు ఉన్నాయి. ఈ గణాంకాలు ఆయన బౌలింగ్ పటిమను తెలియజేస్తున్నాయి. మరి ఈ కివీస్ బౌలర్ ఐపీఎల్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి మరి.

Read more Photos on
click me!

Recommended Stories