కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?

Published : Dec 22, 2025, 10:51 AM IST

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో ఆడటంపై తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మొదట అందుబాటులో ఉండనని చెప్పినా, విరాట్ కోహ్లీ ట్రోఫీలో పాల్గొంటాడని ప్రకటించిన తర్వాత రోహిత్ కనీసం రెండు మ్యాచ్‌లు ఆడతాడని..

PREV
15
అనూహ్యంగా నిర్ణయం మార్చుకున్న రోహిత్

టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీ 2025లో ఆడటానికి అతడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) వర్గాలు వెల్లడించాయి. మొదట రోహిత్ అందుబాటులో లేరని ప్రకటించినప్పటికీ, అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

25
రోహిత్ కీలక నిర్ణయం

గతంలో టీ20 ప్రపంచకప్ 2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ, అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు, అనంతరం టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బీసీసీఐ అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఈ క్రమంలో రోహిత్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి దాదాపు 10 కిలోల బరువు తగ్గారు. మరింత ఫిట్‌గా మారి ఆస్ట్రేలియా గడ్డపై శతకంతో చెలరేగారు. అలాగే, సౌత్ ఆఫ్రికాతో స్వదేశంలో జరిగిన వన్డేల్లోనూ అదరగొట్టారు. ప్రస్తుతం రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరూ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. వన్డే వరల్డ్ కప్ 2027కు సిద్ధమయ్యే క్రమంలో మ్యాచ్ ప్రాక్టీస్ ఆవశ్యకతపై చర్చలు వచ్చాయి.

35
రోహిత్ యూటర్న్..

ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత జట్టులోని ప్రతి సభ్యుడు కచ్చితంగా కనీసం రెండు దేశవాళీ మ్యాచ్‌లలో ఆడాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశం రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని తెలిపింది. అయితే, ఎంసీఏ చీఫ్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ శుక్రవారం మాట్లాడుతూ రోహిత్ శర్మ ముంబై జట్టుకు అందుబాటులో లేడని ప్రకటించారు.

45
విరాట్ రెండు మ్యాచ్‌లకు అందుబాటులో.. అందుకే

ఈ పరిణామాల మధ్య ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ తొలి రెండు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడని ప్రకటించారు. దీని తర్వాత, శుక్రవారం రాత్రి ఎంసీఏ వర్గాలు మరోసారి రోహిత్ శర్మ విషయంపై స్పందించాయి. రోహిత్ కనీసం రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాయి. కోహ్లీ పేరు ప్రకటన తర్వాతే రోహిత్ శర్మ ఈ యూ-టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

55
ముంబై జట్టులో స్టార్ ప్లేయర్స్

మరోవైపు, ముంబై జట్టుకు చెందిన టీమిండియా స్టార్లు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ శివం దూబే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. టీ20 ప్రపంచకప్ 2026ను దృష్టిలో ఉంచుకొని వారికి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ముంబై మాజీ కెప్టెన్ అజింక్యా రహానే అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత జట్టులో చేరే అవకాశం ఉంది. విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories