ఆర్సీబీని అమ్మేస్తున్నారు.. కొత్త ఓనర్ ఎవరు?

Published : Nov 05, 2025, 11:14 PM IST

RCB Sale : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను యజమానిగా ఉన్న డియాజియో జట్టు అమ్మకం ప్రక్రియను ప్రారంభించింది. 2026 మార్చి 31 నాటికి కొత్త యజమాని ఖరారు కానున్నట్లు అంచనా. కొత్త ఓనర్ ఎవరు? ఎందుకు కోహ్లీ టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది?

PREV
16
అధికారికంగా ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ షురూ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ అధికారికంగా విక్రయానికి వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో పాల్గొనే ఈ జట్టును యజమానిగా ఉన్న బ్రిటన్‌కు చెందిన మద్యం దిగ్గజం డియాజియో (Diageo) తన భారతీయ అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) ద్వారా అమ్మకం ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియను 2026 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

26
స్టాక్ ఎక్స్చేంజ్‌కు అధికారిక సమాచారం అందించిన కంపెనీ

బుధవారం (నవంబర్ 5న) బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE)కు డియాజియో పంపిన నివేదికలో, సంస్థ తమ అనుబంధ సంస్థ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RCSPL) పై స్ట్రాటజిక్ రివ్యూ ప్రారంభించినట్లు తెలిపింది. ఈ సంస్థే పురుషుల ఐపీఎల్, మహిళల డబ్ల్యూపీఎల్‌లో ఆడే ఆర్సీబీ జట్లను నిర్వహిస్తోంది.

కంపెనీ వెల్లడించిన ప్రకారం, “RCSPL వ్యాపారం ప్రధానంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును నిర్వహించడం. ఇది ప్రతి సంవత్సరం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆధ్వర్యంలో జరిగే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్లలో పాల్గొంటుంది” అని పేర్కొంది.

36
డియోజియో వ్యూహాత్మక సమీక్షలో భాగంగా కీలక నిర్ణయం

యునైటెడ్ స్పిరిట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రవీణ్ సోమేశ్వర్ ఒక ప్రకటనలో.. “RCSPL మా సంస్థకు విలువైన వ్యూహాత్మక ఆస్తి అయినప్పటికీ, ఇది మా ప్రధాన మద్యం వ్యాపారానికి (alcobev business) సంబంధం లేని విభాగం. ఈ చర్యలు యూఎస్ఎల్, డియాజియో సంస్థలు తమ భారత వ్యాపార పోర్ట్‌ఫోలియోను పునఃపరిశీలిస్తూ దీర్ఘకాలిక విలువను అందించేందుకు కట్టుబడి ఉన్నాయని సూచిస్తుంది” అని పేర్కొన్నారు.

ఈ వ్యూహాత్మక అమ్మకం ప్రక్రియను 2026 మార్చి 31 నాటికి పూర్తిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

46
ఆర్సీబీ కొత్త యజమాని ఎవరై ఉంటారు?

స్పోర్ట్స్ బిజినెస్ వర్గాల సమాచారం ప్రకారం, ఆర్సీబీని కొనుగోలు చేయడంపై అనేక ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అందులో అదానీ గ్రూప్, జిందాల్(JSW) గ్రూప్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత ఆదార్ పూనావాలా, అలాగే దేవ్యానీ ఇంటర్నేషనల్ గ్రూప్ యజమాని రవీ జైపూరియా పేర్లు వినిపిస్తున్నాయి.

పలు రిపోర్టుల ప్రకారం.. ఆర్సీబీ విలువ దాదాపు 2 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా. యునైటెడ్ స్పిరిట్స్ గత ఆర్థిక సంవత్సరంలో పొందిన మొత్తం లాభాల్లో 8.3 శాతం ఈ స్పోర్ట్స్ బిజినెస్ ద్వారా వచ్చింది.

56
బెంగళూరు తొక్కిసలాట కారణమా?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ప్రమాదం (జూన్ 4) తర్వాత ఆర్సీబీ భవిష్యత్తుపై చర్చలు ముమ్మరమయ్యాయి. 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడంతో సంస్థపై షేర్‌హోల్డర్ల ఒత్తిడి పెరిగింది.

ఆర్సీబీ స్పోర్ట్స్ విభాగం సంస్థకు నాన్-కోర్ ఆస్తిగా పరిగణించబడటం, సంస్థ తమ ప్రధాన మద్యం వ్యాపారంపైనే దృష్టి పెట్టాలని భావించడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని సమాచారం.

66
ఐపీఎల్ చరిత్రలో మరో కీలక మలుపు

ఆర్సీబీ విక్రయం ఐపీఎల్ చరిత్రలో మరో కీలక మలుపుగా నిలవవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన ఆర్సీబీకి కొత్త యజమాని ఎవరో అనే ఆసక్తి అభిమానుల్లో ఇప్పటికే పెరిగింది.

డియోజియో నిర్ణయం కేవలం వ్యాపార దృక్పథంలో తీసుకున్నది అయినప్పటికీ, ఇది భారత క్రికెట్ మార్కెట్ భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిణామం కానుంది. మార్చి 2026 నాటికి ఆర్సీబీకి కొత్త యజమాని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories