అద్భుత ఫామ్‌లో అభిషేక్ శర్మ.. కోహ్లీ రికార్డులు బద్దలు

Published : Nov 05, 2025, 07:54 PM IST

Abhishek Sharma: భారత బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ తన కెరీర్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నారు. గ్రౌండ్ లోకి అడుగుపెట్టగానే ప్రత్యర్థి జట్లకు దడపుట్టిస్తున్నాడు. నవంబర్ 6న ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేయనున్నాడు.

PREV
15
అభిషేక్ శర్మ దెబ్బకు కోహ్లీ రికార్డు సమం

భారత యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ బౌలర్ ఎవరైనా సరే దంచికొట్టుడే పనిగా పెట్టుకున్నాడు. అద్భుతమైన హిట్టింగ్, బలమైన ఆత్మస్థైర్యంతో టీమిండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన చేసిన తుపాను బ్యాటింగ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంది. కేవలం అతని ఆట శైలీ మాత్రమే కాదు, స్థిరత్వం కూడా చూపుతూ అభిషేక్ తన బ్యాటింగ్‌కు కొత్త పవర్ ను తీసుకువచ్చాడు.

అభిషేక్ అడుగుపెట్టగే బౌలర్లపై దాడి చేయడం ఆయన ప్రత్యేకత. పెద్ద షాట్లు కొట్టడం, పవర్‌ప్లేలోనే గేమ్ మోమెంటం మార్చడం ఆయనకు చాలా సులువు. ఈ నేపధ్యంలో నవంబర్ 6న జరిగే భారత్–ఆస్ట్రేలియా నాలుగో టీ20లో ఆయనకు చారిత్రక రికార్డును సృష్టించే అవకాశం ఉంది.

25
కోహ్లీ రికార్డు – అభిషేక్ సమం చేస్తాడా?

టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత ఆటగాళ్లలో వేగంగా 1000 పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేరుపై ఉంది. 2015 అక్టోబర్ 5న ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 27 ఇన్నింగ్స్‌లలోనే 1000 పరుగులు పూర్తి చేసి కోహ్లీ భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే మైలురాయిని నెలకొల్పాడు.

దాదాపు 10 ఏళ్ల తర్వాత అదే రికార్డు సమం చేసే ఛాన్స్ అభిషేక్ శర్మకు లభించింది. ప్రస్తుతం 26 ఇన్నింగ్స్‌ల్లో 961 పరుగులు చేసిన ఆయనకు కేవలం 39 పరుగులే కావాలి. నవంబర్ 6న జరిగే మ్యాచ్‌లో ఆయన ఈ పరుగులు చేస్తే కోహ్లీతో సమానంగా నిలుస్తాడు.

35
అద్భుతంగా అభిషేక్ శర్మ టీ20 ఇంటర్నేషనల్ కెరీర్

అభిషేక్ శర్మ 2024లో జింబాబ్వేతో హరారే వేదికగా తన టీ20 అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పటివరకు 27 మ్యాచ్‌లలో 26 ఇన్నింగ్స్‌లు ఆడి, 36.78 సగటుతో 961 పరుగులు సాధించాడు. ఆయన స్ట్రైక్ రేట్ 192.50గా ఉండటం ఆయన బ్యాటింగ్ తీరును స్పష్టంగా చూపుతుంది.

ఈ కాలంలో అభిషేక్ రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు బాదాడు. ఆయన వ్యక్తిగత అత్యధిక స్కోర్ 135 పరుగులు. ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో ప్రదర్శన చూపడం ఆయన ప్రతిభకు నిదర్శనం.

45
కోహ్లీతో పోల్చితే అభిషేక్ దూకుడు

విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో రన్ మిషన్. కానీ అభిషేక్ శర్మ తక్కువ వయసులోనే తన సునామీ బ్యాటింగ్ తో ఉన్నతస్థాయికి చేరుకుంటున్నాడు. కోహ్లీ లాంటి స్థిరత్వం ఇంకా రావలసి ఉన్నా, రికార్డుల పరంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడు. టీ20 ఫార్మాట్‌లో కేవలం పవర్ కాదు, టెక్నిక్ కూడా అవసరమని అభిషేక్ నిరూపిస్తున్నాడు.

ఇక అభిషేక్ రాబోయే మ్యాచ్‌లో రికార్డు సమం చేస్తే, ఆయన భారత క్రికెట్ చరిత్రలో రెండో ఆటగాడిగా గుర్తింపు పొందుతాడు.

55
ఆస్ట్రేలియాతో మ్యాచ్.. అభిషేక్ అదరహో

నవంబర్ 6న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే నాలుగో టీ20 మ్యాచ్ అభిషేక్ శర్మ కెరీర్‌లో ఒక మలుపుగా నిలవవచ్చు. టీమిండియా ఇప్పటికే సిరీస్‌ పోటీలో ఉంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ ఫోకస్ రికార్డు పై ఉంటే కోహ్లీ రికార్డును సమం చేయడం పక్కాగా కనిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories