RCB : రాబోయే ఐపీఎల్ సీజన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త ఓనర్ తో పాటు కొత్త కెప్టెన్ నాయకత్వంలో ఆడనుంది. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్ 2026 లో ఆడటం కష్టమేనని సమాచారం. ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ తీవ్రమైన గాయానికి గురయ్యాడు. ఇండియా A, దక్షిణాఫ్రికా A జట్ల మధ్య జరిగిన మొదటి నాలుగు రోజుల మ్యాచ్‌లో ఆయనకు గాయం అయింది. రిపోర్టుల ప్రకారం.. పాటిదార్ కనీసం నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో రజత్ పాటిదార్ ఆర్‌సీబీకి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. జట్టుకు తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. దీంతో ఆయనను 2026 సీజన్‌కి కూడా కెప్టెన్‌గా కొనసాగించాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఈ గాయం ఆయన భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపనుందని తెలుస్తోంది.
25
2025లో చరిత్ర సృష్టించిన రజత్ పాటిదార్
31 ఏళ్ల రజత్ పాటిదార్ గత సంవత్సరం అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2025లో 312 పరుగులు చేశారు. కెప్టెన్ గా అదరగొట్టాడు. ఆయన అద్భుతమైన నాయకత్వం జట్టును విజయతీరాలకు చేర్చింది.
ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ లో కూడా ఆయన ప్రభావం చూపారు. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరఫున 382 పరుగులు చేసి టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచారు. రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. రంజీ సీజన్ ప్రారంభంలో తన తొలి డబుల్ సెంచరీని సాధించి జాతీయ స్థాయిలో మళ్లీ గుర్తింపు తెచ్చుకున్నారు.
35
గాయం కారణంగా 4 నెలల విరామంలో రజత్ పాటిదార్
ఇండియా A సిరీస్‌లో రజత్ పాటిదార్ నుంచి మంచి ఇన్నింగ్స్ లు చూస్తామనున్న సమయంలో ఆయనకు గాయం అడ్డుపడింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆయన కేవలం 19, 28 పరుగులు మాత్రమే చేసి గాయపడ్డారు. ఈ కండరాల గాయం తీవ్రంగా ఉండటంతో ఆయనను నిపుణులు కనీసం నాలుగు నెలల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
దీంతో ఆయన 2026 ప్రారంభం వరకు పోటీ క్రికెట్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇది ఐపీఎల్ 2026లో ఆయన పాల్గొనడంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఆర్సీబీ యాజమాన్యం ఇప్పుడు కొత్త కెప్టెన్ ఎంపికపై ఆలోచనలో ఉంది. రజత్ పాటిదార్ సమయానికి ఫిట్ కాకపోతే, జితేష్ శర్మ లేదా కృనాల్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.
జితేష్ శర్మ గత సీజన్‌లో పటిదార్ గాయంతో దూరంగా ఉన్నప్పుడు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయనకు జట్టులో మంచి గౌరవం ఉంది. మరోవైపు, కృనాల్ పాండ్యా ఐపీఎల్, దేశీయ టోర్నీల్లో అనుభవజ్ఞుడైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఫ్రాంచైజీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని తాత్కాలిక కెప్టెన్‌గా నియమించవచ్చు.
55
పటిదార్ రికవరీపై ఆర్‌సీబీ ఆశలు
రజత్ పాటిదార్ పూర్తిగా కోలుకుంటే, ఐపీఎల్ 2026లో ఆయననే కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం ఉంది. ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఒక భారతీయ, స్థానిక అనుభవం కలిగిన నాయకుడిపై విశ్వాసం ఉంచింది.
పాటిదార్ ఆ విశ్వాసాన్ని నిలబెట్టినా, గాయం ఆయన ప్రణాళికలకు ఆటంకంగా మారింది. జట్టు ఇప్పుడు ఆయన ఆరోగ్యం, రికవరీపై అప్‌డేట్ కోసం వేచి చూస్తోంది.
రజత్ పాటిదార్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో దానిపైనే ఆర్‌సీబీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఐపీఎల్ 2026లో ఆయన లభ్యత నిర్ణయాత్మకమవుతుంది. ఆయన లేని పరిస్థితిలో జితేష్ శర్మ లేదా కృనాల్ పాండ్యా నాయకత్వం తీసుకునే అవకాశం బలంగా ఉంది.