'నా టైంలో జరిగుంటే.. నేరస్థుడిని నేనే'.. టీమిండియా ఓటములపై బిగ్ స్టేట్‌మెంట్

Published : Dec 03, 2025, 08:55 PM IST

Ravi Shastri: టీమిండియా టెస్ట్ క్రికెట్‌లో గత ఏడాది కాలంగా ఎదుర్కొంటున్న వైఫల్యాలపై మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.100 శాతం గౌతమ్ గంభీర్‌దే బాధ్యత అని బదులిచ్చాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. 

PREV
15
టెస్టుల్లో టీమిండియా పతనం..

టీమిండియా గత ఏడాది కాలంగా టెస్ట్ క్రికెట్‌లో ఎదుర్కొంటున్న పతనాలపై భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో సొంతగడ్డపై ఎదురైన పరాజయాలు, అలాగే ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-3తో ఓటమి వంటి వరుస వైఫల్యాలను జీర్ణించుకోలేకపోతున్నానని అతడు తెలిపాడు.

25
టీమిండియా చెత్త బ్యాటింగ్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి భారత జట్టు ప్రదర్శనపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. "గువాహటిలో ఏమైంది చెప్పండి? 100 పరుగులకు ఒక వికెట్ నుంచి 130 పరుగులకు ఏడు వికెట్లు ఎలా కోల్పోయారు?" అని ప్రశ్నించాడు. ఈ జట్టు అంత బలహీనమైనది కాదని, ఇలాంటి పతనం ఆటగాళ్ల బాధ్యతారాహిత్యమేనని అతడు స్పష్టం చేశాడు. ఎన్నో ఏళ్ల నుంచి స్పిన్‌ను బాగా ఆడుతున్న ఆటగాళ్లు ఇలా ఆడతారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ప్రస్తుత వైఫల్యాలకు ఆటగాళ్లే బాధ్యత వహించాలని సూచించాడు.

35
గంభీర్‌దే బాధ్యత..

ఇదే ఇంటర్వ్యూలో, మీరు గౌతమ్ గంభీర్‌ను సమర్థిస్తున్నారా అన్న ప్రశ్నకు రవిశాస్త్రి నేరుగా స్పందిస్తూ, 'అస్సలు లేదు. 100 శాతం అతనికి బాధ్యత ఉంది' అని ఖరాకండిగా చెప్పాడు. తన కోచింగ్ సమయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే, ముందుగా తానే బాధ్యత తీసుకునేవాడినని, అయితే అదే సమయంలో టీమ్ మీటింగ్‌లో ఆటగాళ్లను కూడా గట్టిగా ఇచ్చిపడేసేవాడినని అతడు వివరించాడు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న 2017 నుంచి 2021 మధ్య కాలంలో టీమిండియా టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన విజయాలు సాధించింది.

45
అప్పుడు టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం..

ఆ సమయంలో ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత మూడు సంవత్సరాలకే మళ్లీ ఆస్ట్రేలియాలో మరో సిరీస్ గెలుచుకుంది. టీమిండియా వరుసగా 42 నెలల పాటు నెంబర్ వన్ టెస్ట్ జట్టుగా నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ను సొంతగడ్డపై ఓడించగలిగింది. అయితే, గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని క్రికెట్ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

55
గంభీర్ కోచ్‌గా పరాజయాలు

గంభీర్ నేతృత్వంలో భారత్ కేవలం రెండు టెస్ట్ సిరీస్ విజయాలు మాత్రమే సాధించింది. గత 14 నెలల్లో భారత్ గెలిచింది కేవలం బంగ్లాదేశ్, వెస్టిండీస్‌పై జరిగిన రెండు సిరీస్‌లు మాత్రమే. సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా చేతుల్లో టీమిండియా వైట్ వాష్‌కు గురై తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని విజయంతో ప్రారంభించినప్పటికీ, భారత్ కీలకమైన మ్యాచ్‌లలో పట్టు కోల్పోయి 1-3 తేడాతో ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికాతో ఇటీవల 0-2 తేడాతో ఓడిపోయిన తర్వాత డబ్ల్యూటీసీ 2025-27కి కూడా క్వాలిఫై అవ్వడం ఇప్పుడు దాదాపు కష్టమే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వరుస వైఫల్యాలతో గౌతమ్ గంభీర్, అగార్కర్ వ్యూహాలపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories