4 వన్డేల్లో ఒక్క విజయం.. ఆ మైదానం పేరు వింటేనే టీమిండియా సుస్సుపోయాల్సిందే

Published : Jan 13, 2026, 06:06 PM IST

Team India: భారత్-న్యూజిలాండ్ రెండో వన్డేకు రాజ్ కోట్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఈ మైదానంలో టీమిండియా రికార్డులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు నాలుగు వన్డేలాడి కేవలం ఒక విజయం మాత్రమే సాధించింది. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

PREV
15
రెండో వన్డేకు అంతా సిద్దం..

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న రెండో వన్డేకు రాజ్‌కోట్ సిద్దమైంది. అయితే, ఈ మైదానంపై టీమిండియా రికార్డులు జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతున్నాయి. రాజ్‌కోట్‌లో భారత జట్టు ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడి, ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్‌తో రాజ్‌కోట్‌లో భారత్ తొలిసారి వన్డే మ్యాచ్ ఆడబోతోంది.

25
గత రికార్డులు ఇలా..

గత రికార్డులను పరిశీలిస్తే, భారత్ 2013లో ఇంగ్లాండ్‌తో తొలి వన్డే ఆడింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నాలుగు వికెట్లకు 325 పరుగులు చేయగా, టీమిండియా తొమ్మిది వికెట్లకు 316 పరుగులు చేసి తొమ్మిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 11 పరుగులకే పరిమితం కాగా, గౌతమ్ గంభీర్ 52, యువరాజ్ సింగ్ 61, సురేష్ రైనా 50 పరుగులు సాధించారు.

35
ఆ తర్వాత ఇలా..

2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్వింటన్ డికాక్ సెంచరీ, డుప్లెసిస్ హాఫ్ సెంచరీతో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లకు 270 పరుగులు చేయగా.. భారత్ తరపున రోహిత్ శర్మ 65, విరాట్ కోహ్లీ 77 పరుగులతో ఆరు వికెట్లకు 252 పరుగులు మాత్రమే చేసింది.

45
ఆస్ట్రేలియాపై విజయం..

టీమిండియా ఏకైక విజయాన్ని 2020లో ఆస్ట్రేలియాపై సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్లకు 340 పరుగులు చేయగా, ధావన్ 96, కేఎల్ రాహుల్ 80, కోహ్లీ 78, రోహిత్ 42 పరుగులు చేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా 304 పరుగులకు ఆలౌట్ అయింది. చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లోనూ టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా ఏడు వికెట్లకు 352 పరుగులు చేయగా.. రోహిత్ 81, కోహ్లీ 56 పరుగులు చేసినా భారత్ 286 పరుగులకు ఆలౌట్ అయింది.

55
వ్యక్తిగత ప్రదర్శనలు ఇలా..

రాజ్‌కోట్‌లో విరాట్ కోహ్లీకి మంచి రికార్డ్ ఉంది. అతను నాలుగు ఇన్నింగ్స్‌లలో 226 పరుగులు(సగటు 56.50) సాధించి, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. రోహిత్ శర్మ మూడు ఇన్నింగ్స్‌లలో 188 పరుగులు (సగటు 62.66) చేసి రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లలో 106 పరుగులు(సగటు 53) చేయగా, రవీంద్ర జడేజా మూడు ఇన్నింగ్స్‌లలో 62 పరుగులు, శ్రేయస్ అయ్యర్ రెండు ఇన్నింగ్స్‌లలో 55 పరుగులు సాధించారు. బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు తీయగా, మహమ్మద్ షమీ మూడు వికెట్లు, రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టారు.

Read more Photos on
click me!

Recommended Stories