Paris Olympics 2024: ఒలింపిక్స్ నిర్వహించడానికి ఎంత ఖర్చవుతుంది?

First Published | Jul 26, 2024, 7:39 PM IST

Olympics cost: పారిస్ ఒలింపిక్స్ భారీ ఏర్పాట్ల మధ్య ఘ‌నంగా ప్రారంభమైంది. పారిస్‌లో 117 మంది భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. 2024 ఒలింపిక్, పారాలింపిక్ గేమ్స్ కోసం ఫ్రాన్స్ ఏకంగా $9.7 బిలియన్లను ఖ‌ర్చు చేస్తోంది.
 

Olympics cost: 2024 ఒలింపిక్స్‌కు పారిస్‌ దాదాపు $9.7 బిలియన్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. అయితే, ఇదివరకు ఒలింపిక్స్ నిర్వహించిన నగరాల కంటే తక్కువ అని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో విశ్వక్రీడలను నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు స్పష్టంగా లేవు. ఒలింపిక్ క్రీడలు ఆర్థికంగా లాభదాయకం కాదని కొందరు అంటున్నారు. మరికొందరు దేశ ఆర్దిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడుతున్న వారు ఉన్నారు. 

Olympics, Olympic Games, Neeraj Chopra

అసలు ఒలింపిక్స్ నిర్వహించడానికి ఎంత ఖర్చవుతుంది? బిలియన్ల డాలర్లు ఖర్చు చేయడం అతిథ్య దేశానికి ప్రయోజనాలు అందిస్తుందా? ఈ విషయాలు గమనిస్తే..దాదాపు అన్ని ప్రపంచ దేశాలు పాల్గొనే ఈ క్రీడల నిర్వహణకు భారీగా ఖర్చు అవుతుంది. ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ను నిర్వహించేందుకు పారిస్ ఖర్చు $9.7 బిలియన్లుగా పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26న ప్రారంభం అయ్యాయి. ఆగస్టు 11 వరకు కొనసాగుతుంది. క్రీడా మహోత్సవంలో 10,000 మంది అథ్లెట్లు, మిలియన్ల మంది ప్రేక్షకులు రాబోయే 17 రోజుల పాటు పారిస్‌లో కలుస్తారు.


పారిస్ ఒలింపిక్స్ ఖర్చు ఎంత?

సౌకర్యాలు, కార్యకలాపాల కోసం ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ను నిర్వహించేందుకు పారిస్ చేస్తున్న ఖర్చు €8.9 నుంచి $9.7 బిలియన్లు. S&P గ్లోబల్ రేటింగ్స్ నివేదిక ప్రకారం పారిస్‌లో జరిగే ఆటల కోసం $10 బిలియన్ల కంటే తక్కువ ఖర్చు వస్తుందని అంచనా. అంటే ప్రారంభ బడ్జెట్ కంటే కేవలం 25 శాతం తక్కువ. ఒలింపిక్ క్రీడల నిర్వహణలో ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇందులో భద్రత కోసం చేసే ఖర్చు కూడా అధికంగా ఉంటుంది.పారిస్ ఒలింపిక్స్ భద్రత కోసం 45,000 మంది పోలీసులు,సైనికులతో పాటు 50,000 ప్రైవేట్ కాంట్రాక్టర్లను మోహరిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. 

సీన్ నదిని శుభ్రపరచడానికి అదనపు ఖర్చు కూడా ఉంది. అథ్లెట్లు అందులో ఈత కొట్టేందుకు €1.4 బిలియన్లు ($1.5 బిలియన్లు) వెచ్చించారు. మెట్రో లైన్ 14ను విస్తరించడానికి దాదాపు €3.5 బిలియన్లు ($3.8 బిలియన్లు) కూడా ఉన్నాయి. గతంలో నిర్వహించిన క్రీడల వివరాలు గమనిస్తే.. 2012 లండన్ గేమ్స్ ($16.8 బిలియన్లు), 2016లో రియో ​​($23.6 బిలియన్లు), 2021లో టోక్యో ($13.7 బిలియన్లు) కంటే ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నవని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. 

అయితే ఈ ఖర్చులు తగ్గడానికి కారణమేమిటి?

ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలే ఇందుకు కారణం. పారిస్ ఒలింపిక్స్‌లో 95 శాతం వేదికలు ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందు ఉన్నాయి. మూడు మాత్రమే ఆ తర్వాత నిర్మించారు. అందులో $1.6 బిలియన్ల ఒలింపిక్ విలేజ్, $190 మిలియన్ల ఆక్వాటిక్స్ సెంటర్, $150 మిలియన్ల జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్ వేదిక. అంటే ఒక దేశం ఒలింపిక్ క్రీడలను నిర్వహించడానికి చేయాల్సిన ఖర్చు బిలియన్ల డాలర్లు ఉంటుంది. 

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) నివేదికల ప్రకారం.. "ఒలింపిక్ క్రీడలను నిర్వహించడం వలన శక్తివంతమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి" అని ప్రకటించింది. క్రీడలను నిర్వహించడం వల్ల మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని, పర్యాటకం వృద్ధి చెందుతుందని, నగరం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని పేర్కొంది. 2024 ఒలింపిక్స్ పారిస్‌కు దాదాపు $12.2 బిలియన్ల నికర ఆర్థిక ప్రయోజనాన్ని అందించగలదని ది యూనివర్సిటీ ఆఫ్ లిమోజెస్ నివేదిక పేర్కొంది.

Latest Videos

click me!