RCB : ఇదేందయ్యా ఇది.. గాలిలో తేలుతూ అద్భుత క్యాచ్ పట్టిన సాల్ట్ ! వీడియో వైరల్

Published : Mar 28, 2026, 11:02 PM IST

Phil Salt : ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ఫీల్డర్ ఫిల్ సాల్ట్ అద్భుతమైన వన్-హ్యాండెడ్ క్యాచ్‌తో కళ్లుచెదిరే క్యాచ్ పట్టాడు. హైదరాబాద్ టీమ్ ఇషాన్ కిషన్‌ను పెవిలియన్ పంపాడు. సాల్ట్ మెరుపు ఫీల్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

PREV
15
ఫిల్ సాల్ట్ వన్-హ్యాండెడ్ సూపర్ క్యాచ్‌తో ఇషాన్ కిషన్ షాక్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ తొలి మ్యాచ్ లోనే పరుగుల వర్షం కురిసింది. అలాగే, అద్భుతమైన ఫీల్డింగ్ పలువురు ప్లేయర్లు ఔరా అనిపించారు. ఎం. చిన్నాస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందించింది.

అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఫిల్ సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌లు. ముఖ్యంగా సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్‌ను అవుట్ చేయడానికి సాల్ట్ గాలిలో డైవ్ చేస్తూ పట్టిన వన్-హ్యాండెడ్ క్యాచ్ ఈ సీజన్‌కే అత్యుత్తమ క్యాచ్‌గా నిలిచేలా ఉంది.

25
ఇషాన్ కిషన్ వీరవిహారానికి సాల్ట్ బ్రేక్

టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదబ్బలు తగిలాయి. కానీ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం అద్భుత ఫామ్‌తో చెలరేగిపోయాడు. కిషన్ కేవలం 38 బంతుల్లోనే 80 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

అయితే, 16వ ఓవర్లో అభినందన్ సింగ్ వేసిన ఫుల్ టాస్ బంతిని కిషన్ పాయింట్ దిశగా బలంగా కొట్టాడు. అది కచ్చితంగా బౌండరీ వెళ్తుందని అందరూ భావించారు. కానీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫిల్ సాల్ట్ కుడివైపునకు వేగంగా పరిగెత్తుతూ, గాలిలోకి ఎగిరి ఒంటిచేత్తో ఆ బంతిని అందుకున్నాడు. ఈ మెరుపు క్యాచ్‌తో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది.

35
సాల్ట్ ఫీల్డింగ్ విన్యాసాలు

కేవలం కిషన్, క్లాసెన్ క్యాచ్‌లే కాకుండా, ఇన్నింగ్స్ ఆరంభంలో ట్రావిస్ హెడ్ వికెట్ పడగొట్టడంలోనూ సాల్ట్ కీలక పాత్ర పోషించాడు. జేక్ డఫీ వేసిన షార్ట్ బంతిని హెడ్ పుల్ చేయగా, డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద సాల్ట్ సురక్షితంగా క్యాచ్ అందుకున్నాడు. ఇలా మూడు కీలక క్యాచ్‌లతో సాల్ట్ ఆర్సీబీకి గట్టి పట్టునిచ్చాడు.

45
క్లాసెన్ అవుట్ తో మొదలైన వివాదం

అంతకుముందు 13వ ఓవర్లో హెన్రిచ్ క్లాసెన్ అవుట్ కూడా చర్చనీయాంశమైంది. రోమారియో షెపర్డ్ వేసిన బంతిని క్లాసెన్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సాల్ట్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టి కింద పడిపోయాడు. సాల్ట్ కాలు బౌండరీ వెలుపల ఉన్న కుషన్లకు తగిలిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

దీనిని థర్డ్ అంపైర్ రోహన్ పండిట్‌ రీప్లేలను పరిశీలించి కుషన్లలో ఎటువంటి కదలిక లేదని నిర్ధారించి అవుట్ ఇచ్చారు. అయితే ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్లాసెన్ కూడా తీవ్ర అసంతృప్తితో మైదానాన్ని వీడాడు.

55
201 పరుగులకు పరిమితమైన హైదరాబాద్

ఇషాన్ కిషన్, క్లాసెన్ (31) కలిసి నాలుగో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కిషన్ అవుట్ అయిన తర్వాత సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. చివర్లో అనికేత్ వర్మ 18 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించాడు. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో జేక్ డఫీ అద్భుతమైన స్పెల్ వేసి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.

11 సీట్లు ఖాళీ.. భావోద్వేగ నివాళి

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. 2025లో ఆర్సీబీ తొలి టైటిల్ గెలిచిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారి జ్ఞాపకార్థం చిన్నాస్వామి స్టేడియంలో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచాలని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు ఒక నిమిషం మౌనం పాటించారు. అలాగే ఆర్సీబీ ఆటగాళ్లు నల్లటి రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. వార్మప్ సమయంలో ఆటగాళ్లందరూ 11వ నంబర్ జెర్సీలను ధరించి ఆ అభిమానులకు నివాళులర్పించారు.

Read more Photos on
click me!

Recommended Stories