most centuries in international cricket : అంతర్జాతీయ క్రికెట్‌లో యంగ్ క్రికెటర్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. కానీ, లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ సాధించిన సెంచరీ రికార్డుకు దగ్గరగా ఒక్క క్రికెటర్ కూడా కనిపించడం లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటివరకు అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్లను గమనిస్తే..
sachin batting 2003
1. సచిన్ టెండూల్కర్
టీమిండియ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్ లో అత్యధిక సెంచరీ చేసిన ప్లేయర్. సచిన్ మొత్తం 100 సెంచరీలు బాదాడు.
2. విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ ప్లేయర్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్ గా ఉన్నాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 80 సెంచరీలు కొట్టాడు.
Image credit: ICCFacebook
3. రికీ పాంటింగ్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్ లో 71 సెంచరీలు సాధించాడు. సచిన్, కోహ్లీ తర్వాత అత్యధిక సెంచరీలలో మూడో స్థానంలో ఉన్నాడు.
4. కుమార్ సంగక్కర
శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అంతర్జాతీయ క్రికెట్ లో 63 సెంచరీలతో నాల్గో స్థానంలో ఉన్నాడు.
Jacques Kallis
5. జాక్వెస్ కల్లిస్
దక్షిణాఫ్రికాకు చెందిన ఈ స్టార్ ప్లేయర్ అంతర్జాతీయ క్రికెట్ లో గొప్ప ఆల్ రౌండర్. కలిస్ 62 సెంచరీలతో అత్యధిక సెంచరీల లిస్టులో ఐదో స్థానంలో ఉన్నాడు.
Hashim Amla
6. హషీమ్ ఆమ్లా
దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ హాషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్ లో 55 సెంచరీలు సాధించాడు.
Mahela Jayawardena
7. మహేల జయవర్ధనే
శ్రీలంకకు చెందిన స్టార్ బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్ లో 54 సెంచరీలు సాధించాడు. శ్రీలంక స్టార్ ప్లేయర్ గా అనేక రికార్డులు నమోదుచేశాడు.
8. బ్రియాన్ లారా
వెస్టిండీస్ లెజెండరీ ప్లేయర్ బ్రియాన్ లారా తన కెరీర్ లో మొత్తం 53 అంతర్జాతీయ క్రికెట్ సెంచరీలు సాధించాడు.
9. డేవిడ్ వార్నర్
ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే ఈ ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ లో 49 సెంచరీలు సాధించాడు.
10. రోహిత్ శర్మ
భారత జట్టు కెప్టెన్, ఛాంపియన్ ప్లేయర్ రోహిత్ శర్మ అంతర్జాతీ క్రికెట్ లో 48 సెంచరీలు సాధించాడు. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన మూడో ప్లేయర్ రోహిత్ శర్మ.