హాకీలో అత్య‌ధిక ఒలింపిక్ మెడ‌ల్స్ గెలిచిన టాప్-5 దేశాలు ఇవే..

First Published | Jul 24, 2024, 11:17 PM IST

Nations With Most Olympics Medals in Hockey : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పురుషుల హాకీ జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. భారత జట్టు ఇప్పటి వరకు 8 స్వర్ణాలతో సహా మొత్తం 12 ఒలింపిక్ పతకాలు సాధించింది. గత ఒలింపిక్స్ (టోక్యో 2020)లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈసారి గోల్డ్ మెడ‌ల్ సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.
 

Indian Hockey Team

Countries with most Olympics Medals in Hockey : పారిస్ ఒలింపిక్ గేమ్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్ రాజధానిలో జ‌ర‌గ‌నున్నాయి. పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం భారత ఆటగాళ్లు పూర్తిగా సిద్ధమయ్యారు. ఒలింపిక్ క్రీడల్లో పురుషుల హాకీ జట్టుపై భారత అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఒలింపిక్ హిస్ట‌రీలో హాకీలో అత్య‌ధిక ప‌త‌కాలు గెలుచుకున్న దేశాల‌ను గ‌మ‌నిస్తే.. 

5. పాకిస్తాన్

ఒలింపిక్స్ లో హాకీలో అత్య‌ధిక ప‌తకాలు గెలిచిన టాప్- 5 దేశాల్లో దాయాది పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉంది. పాకిస్తాన్ హాకీ టీమ్ ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 8 ఒలింపిక్ ప‌త‌కాలు గెలుచుకుంది. 


Image credit: PTI

4. నెదర్లాండ్స్

పాకిస్థాన్ త‌ర్వాత ఒలింపిక్ గేమ్స్ లో అత్య‌ధిక ప‌త‌కాలు గెలుచుకున్న 4వ దేశం నెదర్లాండ్స్. ఇప్ప‌టివ‌ర‌కు ఈ దేశం 9 ఒలింపిక్ మెడ‌ల్స్ సాధించింది. 

3. గ్రేట్ బ్రిటన్

హాకీలో అత్య‌ధిక ఒలింపిక్ మెడ‌ల్స్ గెలిచిన టాప్-5 దేశాల్లో గ్రేట్ బ్రిటన్ 3వ స్థానంలో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు గ్రేట్ బ్రిట‌న్ హాకీలో 9 ఒలింపిక్ పతకాలు గెలుచుకుంది. 

Image credit: PTI

2. ఆస్ట్రేలియా

ఒలింపిక్ హిస్ట‌రీలో హాకీలో ఇప్ప‌టివ‌ర‌కు 10 కంటే ఎక్కువ మెడ‌ల్స్ గెలిచిన రెండో దేశం ఆస్ట్రేలియా. టాప్-5 దేశాల్లో ఆస్ట్రేలియా రెండో స్థాన‌లో ఉంది. 

1. భారత్

హాకీలో అత్య‌ధిక ఒలింపిక్ మెడ‌ల్స్ గెలిచిన దేశం భార‌త్. ఇండియా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 12 మెడ‌ల్స్ గెలిచింది. ఇందులో 8 గోల్డ్ మెడ‌ల్స్ ఉన్నాయి. 

Latest Videos

click me!