స్మృతి మంధానను పలాష్ ముచ్చల్ చీట్ చేశాడా? ఇన్‌స్టాగ్రామ్ చాట్ లీక్

Published : Nov 25, 2025, 04:39 PM IST

Smriti Mandhana Palash Muchhal: స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడటానికి మొదట ఆమె తండ్రి అనారోగ్యం కారణమనే వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు పలాష్ మరో మహిళతో సంబంధం పెట్టుకుని చీట్ చేయడమే కారణం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి.

PREV
15
స్మృతి మంధాన పెళ్లి వాయిదాకు కారణం ఏమిటి?

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్‌ స్మృతి మంధాన జీవితంలో నవంబర్ 23 ఒక ముఖ్యమైన రోజు కావాల్సి ఉంది. బెంగళూరులో ఆమె ప్రియుడు, చిత్రనిర్మాత పలాష్ ముచ్చల్‌ను వివాహం చేసుకోవడానికి కుటుంబ సభ్యులంతా ఏర్పాట్లు పూర్తి చేశారు. హల్దీ, సంగీత్ వంటి వేడుకలు గ్రాండ్‌గా ముగిశాయి. అయితే పెళ్లికి గంటల ముందు, వరుస షాకింగ్ ఘటనలు జరిగాయి. స్మృతి పెళ్లి నిరవధికంగా వాయిదా పడిందని ఆమె సన్నిహితులు తెలిపారు.

వాయిదాకు మొదటి కారణం ఆమె తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు రావడంగా పేర్కొన్నారు. ఈ వార్త బయటకు రాగానే అభిమానులంతా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. స్మృతి కూడా తన తండ్రి కోలుకున్న తర్వాతే వివాహం చేసుకుంటానని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.

25
పలాష్ ముచ్చల్ అనారోగ్యం వార్తలు వైరల్

ఈ ఘటనలతో పాటు మరో షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. పలాష్ ముచ్చల్ వైరల్ ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరాడని అతని టీమ్ తెలిపింది. రెండు కుటుంబాల్లో ఈ ఆరోగ్య సమస్యలతో పెళ్లిని వాయిదా వేయడినికి మరింత బలమైన కారణాలుగా మారాయి. అయితే, ఇదే సమయంలో సోషల్ మీడియాలో స్మృతి తన నిశ్చితార్థం, పెళ్లి పోస్టులన్నింటినీ తొలగించడం మరింత చర్చకు దారితీసింది.

35
లీకైన ఇన్‌స్టాగ్రామ్ చాట్: తెరమీదకు కొత్త చర్చ

ఇదంతా జరుగుతుండగానే, అదే రోజు రాత్రి సమయంలో సోషల్ మీడియాలో లీక్ అయిన ఒక ఇన్‌స్టాగ్రామ్ చాట్ వైరల్‌గా మారింది. మేరీ డికోస్టా అనే మహిళ షేర్ చేసిన ఆ చాట్‌లో పలాష్ ముచ్చల్ ఆమెతో సన్నిహితంగా మాట్లాడుతున్నట్లు కనిపించింది. 

ఆ చాట్‌లలో.. స్మృతితో లాంగ్-డిస్టెన్స్ రిలేషన్ గురించి పలాష్ బాధపడటం, టూర్ల కారణంగా వ్యక్తిగత జీవితంలో వచ్చిన గ్యాప్‌లను చెప్పడం, ఇంకా షాకింగ్‌గా, మేరీని తనతో శారీరక సంబంధం కోసం పిలిచినట్టు బయటపడటం సంచలనంగా మారింది. ఈ చాట్‌లు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా #PalashExposed అనే హాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది.

45
పెళ్లి వద్దన్న స్మృతి? స్నేహితులు ఏం చెప్పారంటే?

ఈ చాట్ వైరల్ కావడానికి ముందు స్మృతి మంధాన స్నేహితులు, క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ సహా పలువురు వారి వెడ్డింగ్ ఫోటోలు, ప్రీ-వెడ్డింగ్ వీడియోలను తొలగించారు. దీంతో సోషల్ మీడియాలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. "స్మృతి పెళ్లి వాయిదా అసలు కారణం ఇదేనేమో" అని ఒక వర్గం పేర్కొంటుండగా, మరో వర్గం "అనారోగ్యం మాత్రమే వాయిదాకు కారణం, వదంతులు వద్దు" అంటూ మరో వర్గం పేర్కొంటోంది.

అయితే, పెళ్లికి కేవలం 24 గంటల ముందు పలాష్ వేరే మహిళతో చాట్ చేస్తున్నాడనే ఆరోపణలు సంచలనంగా మారాయి.

55
సోషల్ మీడియాలో హాట్ టాపిక్

స్మృతి అభిమానులు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో ఆమెకు సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు. "పెళ్లి ముందు నిజస్వరూపం బయటపడింది, ఇదీ మంచికే.. స్మృతిలాంటి అమ్మాయిని ఇలా చీట్ చేయడం బాధాకరం" అంటూ అనేక కామెంట్లు వెల్లువెత్తాయి.

అయితే, ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉందనే ప్రశ్నకు ఇప్పటి వరకు రెండు కుటుంబాల నుంచి అధికారిక ప్రతిస్పందన రాలేదు. ఇది నిజామా, అబద్దమా అనే వివరాలు తెలియాలంటే మరికొంత సమయం వేచిచూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories