T20 World Cup 2026: నెదర్లాండ్స్ దెబ్బకు వణికిపోయిన పాకిస్థాన్.. పరువు పోయేదే !

Published : Feb 07, 2026, 04:22 PM IST

T20 World Cup 2026: నెదర్లాండ్స్ దెబ్బకు పాకిస్థాన్ వణికిపోయింది. టీ20 ప్రపంచకప్ 2026 తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో అతికష్టంగా విజయం సాధించింది. ఫహీమ్ అష్రఫ్ 11 బంతుల్లో 29 పరుగులు చేసి పాక్ పరువు కాపాడాడు.

PREV
16
వరల్డ్ కప్‌లో షాకింగ్ ట్విస్ట్.. పసికూన చేతిలో ఓడిపోవాల్సిన పాక్ ఎలా గెలిచిందంటే?

కొలంబో లో జరిగిన 2026 టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు వణికిపోయింది. పసికూన చేతిలో ఓడిపోవాల్సిన మ్యాచ్ లో అతికష్టం మీద గెలిచింది. నెదర్లాండ్స్ విసిరిన 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో పాక్ బ్యాటర్లు తడబడ్డారు. ఒక దశలో ఓటమి ఖాయమనుకున్న స్థితిలో ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్ మెరుపు ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్‌ను గెలిపించాడు. కేవలం 11 బంతుల్లో 29 పరుగులు చేసిన అష్రఫ్, చివరలో పాకిస్థాన్ పరువును కాపాడారు.

26
నెదర్లాండ్స్ పోరాటం: 147 పరుగులకు ఆలౌట్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. పవర్‌ప్లే ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. ఓపెనర్ మైకేల్ లెవిట్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి ధాటిగా ఆడగా, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (37), బాస్ డి లీడ్ (30) బాధ్యతాయుతంగా ఆడారు. ఒకానొక సమయంలో డచ్ జట్టు 15 ఓవర్లలో 123/4 స్కోరుతో పటిష్టంగా కనిపించింది.

అయితే, పాక్ స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్ (2/23), సయీమ్ అయూబ్ (2/7) విజృంభించడంతో నెదర్లాండ్స్ కేవలం 20 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది. దీంతో 19.5 ఓవర్లలో 147 పరుగులకు నెదర్లాండ్స్ ఆలౌట్ అయ్యింది. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3 వికెట్లు పడగొట్టారు.

36
తడబడిన పాక్ టాప్ ఆర్డర్

148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు సయీమ్ అయూబ్ (24), సాహిబ్జాదా ఫర్హాన్ (47) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 98 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్, ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలింది. కేవలం 2 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయి 105/5 స్థితికి చేరుకుంది. బాబర్ ఆజం (15), ఉస్మాన్ ఖాన్ (0) విఫలం కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. నెదర్లాండ్స్ బౌలర్లు పాల్ వాన్ మీకెరెన్, ఆర్యన్ దత్ చెరో రెండు వికెట్లతో పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు.

46
పాకిస్థాన్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం

పాకిస్థాన్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ జట్టుపై విమర్శల వర్షం కురిపించారు. పసికూనలపై కూడా గెలవలేకపోతున్నారంటూ పాక్ అభిమానులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాబర్ ఆజం, అఘా సల్మాన్ వంటి సీనియర్ ఆటగాళ్లు చేతులెత్తేయడంతో పాక్ జట్టు దాదాపు ఓటమి అంచుల్లోకి వెళ్ళింది. 114 పరుగులకే 7 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ నెదర్లాండ్స్ వైపు మొగ్గింది.

56
ఫహీమ్ అష్రఫ్ ఆఖరి ఓవర్ మ్యాజిక్

చివరి 12 బంతుల్లో పాకిస్థాన్ విజయానికి 29 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్ వేసిన లోగాన్ వాన్ బీక్ బౌలింగ్‌లో ఫహీమ్ అష్రఫ్ వీరవిహారం చేశాడు. ఆ ఓవర్‌లో మూడు భారీ సిక్సర్లు, ఒక ఫోర్ బాది ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. దీంతో సమీకరణం చివరి ఓవర్‌లో 5 పరుగులుగా మారింది. ఆఖరి ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టిన అష్రఫ్, 19.3 ఓవర్లలోనే పాకిస్థాన్‌కు 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఫహీమ్ అష్రఫ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

66
విజయంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ఏమన్నారంటే?

మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడుతూ, తమ బౌలింగ్ ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేసినా, బ్యాటింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడాల్సి ఉందని, ఈ గెలుపు తమకు ఒక పాఠమని పేర్కొన్నారు. మరోవైపు నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ, గెలుపు అంచుల్లోకి వచ్చి ఓడిపోవడం బాధ కలిగించిందని, అయితే తమ జట్టు పోరాడిన తీరు గర్వంగా ఉందని చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories