Published : Feb 07, 2026, 11:19 AM ISTUpdated : Feb 07, 2026, 11:30 AM IST
ICC Mens T20 World Cup 2026 : ఈసారి కూడా టీ20 వరల్డ్ కప్ టీమిండియాకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకుల అంచనా. కేవలం మాటలు కాదు… ఇందుకు 5 స్ట్రాంగ్ రీజన్స్ చెబుతున్నారు.
ICC T20 World Cup 2026 : ఐసిసి నిర్వహించే మెగా టోర్నీల్లో టీ20 వరల్డ్ కప్ ఒకటి... ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే దేశాలన్నీ ఈ టోర్నీలో పాల్గొంటాయి. ఇలాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీకి ప్రస్తుతం భారత్ ఆతిథ్యం ఇస్తోంది... ఈ క్రమంలో ఇప్పటికే రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా ముచ్చటగా మూడోసారి స్వదేశంలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ (ఫిబ్రవరి 7న) టీమిండియా తొలి మ్యాచ్ ఆడబోతోంది.
క్రికెట్ విశ్లేషకుల ప్రకారం... ప్రస్తుతం టీమిండియా టీ20 ఫార్మాట్ లో అదరగొడుతోంది... వరల్డ్ నెంబర్ 1 టీ20 టీమ్ ఇదే. ఇలాంటి దేశాన్ని స్వదేశంలో ఓడించడం చాలా కష్టం... కాబట్టి టీ20 ట్రోఫీ భారత్ దే అంటున్నారు. ఇలా టీ20 వరల్డ్ కప్ టీమిండియా ఎందుకు గెలుస్తుందో మరో ఐదు కారణాలు చెబుతున్నారు... అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
26
సూర్యకుమార్ విశ్వరూపం చూస్తామా..?
భారత టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కు ఇది మొదటి వరల్డ్ కప్. అలాగే టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌతమ్ గంభీర్ ఫస్ట్ వరల్డ్ కప్ ను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ ఇద్దరికీ ఈ వరల్డ్ కప్ ఎంతో ప్రత్యేకమైనది... ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. వీళ్లు జట్టు విజయం కోసం వందకు వందశాతం ప్రయత్నిస్తారు… ఓటమిని అస్సలు అంగీకరించరు.
ఇక సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇప్పటికే టీ20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించారు. వీళ్లు లేకుండా టీమిండియా ఆడుతున్న మొదటి ప్రపంచ కప్ ఇది. అయితే వీళ్ల రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు వీక్ అవుతుందని అందరూ భావించారు... కానీ ఊహకందని విధంగా యువ టీ20 టీం అద్భుతాలు చేస్తోంది... ఇప్పటికే వరుస విజయాలు సాధించింది. ఇదే దూకుడు టీ20 వరల్డ్ కప్ లోనూ కనబర్చి ట్రోఫీని దక్కించుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.
36
పవర్‌ప్లేలో బ్యాటింగ్ ఆధిపత్యం
టీమిండియా పవర్‌ప్లేలో ఆధిపత్యం చెలాయించనుంది... ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్‌తో కలిసి బలమైన పునాది వేయడం ఖాయం. వీళ్ళిద్దరూ ఆడితే టీమిండియా గెలుపు ఖాయం.
కోచ్ గంభీర్ మార్గదర్శకత్వంలో మిడిల్ ఆర్డర్ చాలా ఫ్లెక్సిబుల్‌గా మారింది. కెప్టెన్ సూర్యకుమార్, సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, దూకుడుగా ఆడే శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్ అద్భుతాలు చేయగలరు. వీళ్లంతా తమదైన రోజు ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల సత్తా ఉన్నవారే.
56
స్పిన్ వ్యూహం
స్వదేశీ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించనున్నాయి. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌తో కూడిన భారత స్పిన్ దళం చాలా బలంగా ఉంది. మిడిల్ ఓవర్లలో వీరే కీలకం కానున్నారు. వీళ్లలో ఏ ఒక్కరు రాణించినా విజయం టీమిండియాదే.
66
బలంగా ఫేస్ అటాక్
సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్ పేస్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో వీరిద్దరి బౌలింగ్ చాలా ముఖ్యం. గత ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అర్ష్ దీప్... ఈసారి కూడా ఇతడు స్వదేశీ పిచ్ లపై రెచ్చిపోతే టీమిండియా గెలుపును ఎవరూ అడ్డుకోలేరు. బుమ్రా, అర్ష్ దీప్ లు తమ ఫేస్ అటాక్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడం ఖాయం.