IND vs PAK: ఆసియా కప్ 2025లో భారత్- పాకిస్తాన్ సూపర్-4 మ్యాచ్ కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 140 కోట్ల భారతీయులకు ఒక వాగ్దానం చేశారు. సూపర్ సండే కోసం సిద్ధంగా ఉండాలంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఆసియా కప్ 2025 సూపర్-4 లో భాగంగా భారత్- పాకిస్తాన్ జట్టు మధ్య జరుగబోయే కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఈ ఉత్కంఠభరిత పోరు ఆదివారం (సెప్టెంబర్ 21) న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.
మ్యాచ్ ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యకుమార్ 140 కోట్ల భారతీయులకు వాగ్దానం చేస్తూ.. ఈ మ్యాచ్‌ను చూసి అందరికీ థ్రిల్, ఆనందం కలుగుతుందని అన్నారు.
25
పాకిస్తాన్ పేరు ప్రస్తావించని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్‌లో మీడియా నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొత్తం సమయంలో ఆయన ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ పేరును ఒక్కసారికూడా ప్రస్తావించలేదు. ఈ మ్యాచ్‌తో ఆసియా కప్ లో భారత్ రెండోసారి పాకిస్తాన్ తో తలపడనుంది.
సెప్టెంబర్ 14న జరిగిన తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై అద్భుత విజయాన్ని సాధించింది. ఆ గెలుపు తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాలను కూడా సూర్యకుమార్ ప్రస్తావించారు. “మేము గెలిచాం, అందుకే సంతోషం పంచుకున్నాం” అంటూ ట్రోల్స్ పై కూడా స్పందించారు.
35
పాక్ తో మ్యాచ్.. సూర్యకుమార్ ఏమన్నారంటే?
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “ఆదివారం రోజు ఎక్కువ మంది ప్రేక్షకులు మ్యాచ్‌ను వీక్షిస్తారు. వారు కూర్చుని ఆటను ఆనందించాలి. మేము మైదానంలో అదే ఉత్సాహం, అదే శక్తితో బరిలోకి దిగుతాం. మేము ఎప్పటికప్పుడు మా బెస్ట్ ను ఇవ్వడానికి ప్రయత్నిస్తాం” అని తెలిపారు. అలాగే, 140 కోట్ల భారతీయులకు “మీ సండే ప్రత్యేకం అవుతుంది” అని చెప్పాడు.
సూర్యకుమార్ భారత జట్టు ప్రిపరేషన్ గురించి కూడా మాట్లాడారు. “ఈ టోర్నమెంట్‌లో మా ప్రిపరేషన్ అద్భుతంగా ఉంది. ఇప్పటికే మూడు మంచి మ్యాచ్‌లు ఆడాం. మేము ఎప్పుడూ ఆడుతున్న ప్రస్తత మ్యాచ్‌పైనే దృష్టి పెడతాం. గత రెండు మూడు మ్యాచ్‌లలో అలవాటు చేసుకున్న మంచి పద్ధతులను కొనసాగిస్తాం. కేవలం ఒక మంచి మ్యాచ్ ఆడామని మనకు లాభం ఉండదు. మళ్లీ కొత్తగా మొదలు పెట్టాలి. ఆ రోజు ఎవరు బాగా ఆడతారో వారు గెలుస్తారు” అని వ్యాఖ్యానించారు.
55
భారత్-పాకిస్తాన్ రికార్డులు ఎలా ఉన్నాయి?
ఆసియా కప్‌లో టీ20 ఫార్మాట్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ మూడింట గెలిచింది. దుబాయ్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో భారత్ వియం సాధించింది. ఈ గణాంకాలు భారత జట్టుకు విశ్వాసాన్ని పెంచుతున్నాయి. అయితే కెప్టెన్ మాటల ప్రకారం, ప్రతి మ్యాచ్ కొత్తదే, కాబట్టి ఆటలో పూర్తి శక్తిని వినియోగించడం తప్పనిసరి.