Smriti Mandhana : భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ఆస్ట్రేలియా బౌలింగ్ ను దంచికొట్టింది. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన భారత మహిళా క్రికెటర్ గా స్మృతి మంధాన రికార్డు సాధించింది.
భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డేలో పరుగుల వర్షం కురుస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మహిళల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన సునామీ బ్యాటింగ్ తో ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ కొట్టిన భారత ప్లేయర్ గా రికార్డు సాధించింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ జట్టు దూకుడు ఆరంభించింది. ఈ మ్యాచ్‌లోస్మృతి మంధాన ధనాధన్ బ్యాటింగ్ తో రికార్డుల మోత మోగించింది.
26
ఆస్ట్రేలియా 412 పరుగులతో రికార్డు స్కోరు
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ జార్జియా వాల్ 81 పరుగులతో జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చింది. మధ్యలో బెత్ మూనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 75 బంతుల్లో 138 పరుగులు చేసి మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచింది. 23 ఫోర్లు, 1 సిక్స్‌తో ఆమె రికార్డు ఇన్నింగ్స్ ఆడింది. ఎల్లీస్ పెర్రీ 68, అష్లే గార్డ్నర్ 39 పరుగులు జోడించారు. మొత్తం 47.5 ఓవర్లలో ఆస్ట్రేలియా 412 పరుగులకు ఆలౌటైంది.
36
భారత బౌలర్లు ప్రభావం చూపించలేకపోయారు
భారత బౌలర్లు వికెట్లు తీయడంలో విజయవంతమైనా పరుగులను కట్టడి చేయలేకపోయారు. అరుంధతి రెడ్డి 86 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. స్నేహ్ రాణా, క్రాంతి గౌర్ చెరో వికెట్ అందించారు. కానీ ఆస్ట్రేలియా స్కోరు ఇప్పటికే భారత జట్టుకు పెద్ద సవాలుగా మారింది.
ఛేజింగ్ లో భారత ఇన్నింగ్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ప్రియాంక రావల్ (10), హర్లీన్ డియోల్ (11) తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. కానీ స్మృతి మంధాన దూకుడు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. 23 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్లతో రికార్డు హాఫ్ సెంచరీ సాధించింది. ఆష్లే గార్డ్నర్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టి మైలురాయిని చేరుకుంది. ఇది మహిళల వన్డేల్లో భారత తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీగా నిలిచింది.
ఇంతటితో ఆగకుండా మంధాన 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసింది. దీంతో ఆమె వన్డేల్లో భారత క్రికెటర్లలోనే అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్ లోకి చేరింది. మంధాన 63 బంతుల్లో 125 పరుగుల నాక్ ఆడారు. 17 ఫోర్లు, 5 సిక్సర్లు బాదారు.
56
వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు కొట్టిన టాప్ 5 భారత ప్లేయర్లు
మహిళల వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీల జాబితాలో మంధాన కొత్త రికార్డు నెలకొల్పింది.