Womens World Cup 2025: పాకిస్తాన్ ఘోర అవమానానికి గురైంది. ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025 లో పాకిస్తాన్ జట్టు ఏ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే 3 పాయింట్లతో ప్రయాణం ముగించింది. ఆ పాయింట్లు కూడా మ్యాచ్‌లు రద్దు కావడంతో వచ్చాయి.
ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025లో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు ప్రదర్శన పూర్తిగా నిరాశపరిచింది. ఘోర అవమానం మూటగట్టుకుంది. ఫాతిమా సనా కాప్టెన్సీలో ఆడిన పాక్ జట్టు సెమీఫైనల్ రేస్ నుంచి ముందుగానే నిష్క్రమించింది. ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే జట్టు ప్రయాణం ముగిసింది. ఇండియా, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ తమ అన్ని మ్యాచ్‌లను శ్రీలంక రాజధాని కొలంబోలోనే ఆడింది.
పాక్ జట్టు సెమీఫైనల్ అవకాశాలు కోల్పోయాక, చివరి మ్యాచ్‌లో అయినా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్టోబర్ 24న శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్ మళ్లీ వర్షం కారణంగా రద్దయ్యింది. 4.2 ఓవర్ల ఆట తర్వాత మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి పాకిస్తాన్ 18 పరుగులు చేసింది.
25
7 మ్యాచ్‌లు, 3 పాయింట్లు.. పాకిస్తాన్ చెత్త రికార్డు
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టు మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి ఒకటి కూడా గెలవని టీమ్ గా చెత్త రికార్డును సాధించింది. ఈ ఏడు మ్యాచ్ లలో పాకిస్తాన్ 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో 3 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి.
మూడూ రద్దైన మ్యాచ్‌లతో వచ్చిన 3 పాయింట్లతో పాక్ జట్టు 8 జట్లలో 7వ స్థానంలో నిలిచింది. పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ నెట్ రన్‌రేట్ -2.651 గా నమోదైంది. ఇక శ్రీలంక 1 విజయం, 3 ఓటములు, 3 మ్యాచ్ ల రద్దుతో 5 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది.
35
భారత్‌కు రావడానికి నిరాకరించిన పాక్ జట్టు
రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు భారత్‌కు రావడానికి నిరాకరించింది. అందుకే తమ అన్ని మ్యాచ్‌లను కొలంబోలోనే ఆడింది.
టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ బిగ్ షాక్ ఇచ్చింది. భారత మహిళల జట్టు కూడా పాకిస్తాన్‌పై సులభంగానే విజయం అందుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లోనూ పాక్ జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
అలాగే, పాకిస్తాన్ కీలకమైన మ్యాచ్‌లు వరుసగా వర్షం కారణంగా రద్దు కావడంతో టోర్నీ నుంచి చెత్త రికార్డుతో అవుట్ అయింది.
మహిళల ప్రపంచ కప్ 2025 లీగ్ దశ పూర్తై సెమీఫైనల్‌కు 4 జట్లు చేరాయి. అవి
• ఆస్ట్రేలియా
• దక్షిణాఫ్రికా
• ఇంగ్లాండ్
• భారత్
ఎవరెవరు ఎవరితో తలపడతారని విషయం పై ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. శనివారం (25 అక్టోబర్) మ్యాచ్ తర్వాత తుది షెడ్యూల్ ఖరారవుతుంది.
55
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య మరో థ్రిల్లర్
సెమీఫైనలిస్టులు ఖరారైనా, ఇండోర్ హోల్కర్ స్టేడియంలో శనివారం జరిగే మహిళల వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్‌పై ఆసక్తి పీక్‌కు చేరింది. టాప్‌స్పాట్ కోసం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య థ్రిల్లర్ పోరుకు రంగం సిద్ధమైంది.
డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా ఎనిమిదేళ్లుగా వరల్డ్ కప్‌లో అజేయ ప్రయాణం కొనసాగిస్తుండగా, ఇంగ్లాండ్ చేతిలో అవమానకర ఓటమి తర్వాత ఐదు వరుస విజయాలతో సౌతాఫ్రికా జట్టు అద్భుతమైన పునరాగమనాన్ని చూపింది. చరిత్ర ఆస్ట్రేలియా వైపు నిలిచినా, దక్షిణాఫ్రికా జోష్ తో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే ఛాన్స్ ఉంది.