తెలుగు ప్లేయర్ కు షాక్.. ఛాంపియన్ ప్లేయర్ ఎంట్రీ.. కంగారెత్తిస్తాడు భయ్యా !

Published : Oct 25, 2025, 09:39 AM IST

IND vs AUS: భారత జట్టులోకి ప్రపంచ కప్ ఛాంపియన్ ప్లేయర్ తిరిగివచ్చాడు. సిడ్నీ వన్డేలో భారత్ జట్టులో 2 మార్పులు చోటుచేసుకున్నాయి. అర్షదీప్ సింగ్, నీతిష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యారు.

PREV
15
సిడ్నీ వన్డేలో కీలక మార్పులతో భారత్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చివరి వన్డే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆరంభమైంది. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిన భారత జట్టు, ఈ మ్యాచ్‌లో గౌరవం కాపాడుకోవాలని లక్ష్యంగా తీసుకుంది. ఎలాగైనా గెలుపుతో సిరీస్ ను ముగించాలనుకుంటోంది.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 లో రెండు ప్రధాన మార్పులు చోటుచేసుకున్నాయి. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. అర్షదీప్ సింగ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ ను తీసుకున్నారు.

కుల్దీప్ యాదవ్ ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మొదటిసారి వన్డే ఆడుతున్నారు. ఐదు మ్యాచ్‌లలో ఏడు వికెట్లు తీసి ఆ టోర్నమెంట్‌లో ఆయన భారత జట్టుకు రెండవ అత్యుత్తమ బౌలర్‌గా నిలిచారు.

25
మళ్లీ టాస్ ఓడిపోయిన భారత్

19 నవంబర్ 2023న జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ నుంచి ఇప్పటివరకు భారత్ వరుసగా 18 సార్లు టాస్‌లో ఓడిపోయింది. మూడో వన్డేలో కూడా టాస్ ఓడిపోయింది. ఇది ఒక ప్రపంచ రికార్డు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని చెప్పాడు. యువ ఆటగాళ్ల ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశారు.

భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ మాట్లాడుతూ, “మేము కూడా మొదట బౌలింగ్‌ చేయాలనుకున్నాం. గత మ్యాచ్‌లో కొన్ని అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాం. ఈరోజు మంచి మ్యాచ్ ను ఆడాలనుకుంటున్నాము.. జట్టులో రెండు మార్పులు చేశాం” అన్నారు.

35
భారత్‌కు పెద్ద సవాల్

సిడ్నీ వన్డే రికార్డులు భారత జట్టుకు కలిసి రావడం లేదు. ఇక్కడ భారత్ ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు 19 మ్యాచ్‌లు ఆడగా, 16లో ఓడిపోయింది. కేవలం రెండింటిలో మాత్రమే విజయం దక్కింది. మరో మ్యాచ్ ఫలితం రాలేదు. భారత జట్టు మొత్తం సిడ్నీలో 21 వన్డేలు ఆడి 5 విజయాలు మాత్రమే సాధించింది.

ఈ గ్రౌండ్‌లో టాస్ గెలిచిన జట్టు ఎక్కువ మ్యాచ్‌ల్లో ఆధిక్యంలో నిలిచింది. చివరి తొమ్మిది వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే విజేతగా నిలిచింది. ఇది కూడా ఆస్ట్రేలియాకు సహాయపడే ఛాన్స్ గా ఉంది.

45
భారత్-ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్

ఇరుజట్లు వన్డేల్లో 154సార్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 86 విజయాలు, భారత్ 58 విజయాలు సాధించాయి. పది మ్యాచ్‌లు ఫలితం లేకుండానే ముగిశాయి. సిరీస్‌లో భారత్ 0-2తో వెనుకబడి ఉంది. వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలంటే మూడో వన్డేను తప్పకుండా గెలవాలి.

55
సిడ్నీ వన్డేకు ఇరు జట్ల ప్లేయింగ్ 11

భారత్: రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మ్యాట్ షార్ట్, మాథ్యూ రెన్షా, అలెక్స్ క్యారీ, (వికెట్ కీపర్), కూపర్ కానొల్లి, మిచెల్ ఓవెన్, నాథన్ ఎలిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

Read more Photos on
click me!

Recommended Stories