గంభీర్ రాకతో టీమిండియా రాంరాం.! మరో డబ్ల్యూటీసీ ఫైనల్ హుష్‌కాకి..

Published : Dec 14, 2025, 03:19 PM IST

WTC: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా స్థానం మరింత దిగజారింది. ఇటీవల వెస్టిండీస్‌తో మ్యాచ్ గెలిచి న్యూజిలాండ్ మూడో స్థానానికి ఎగబాకింది. టీమిండియా ఆరో స్థానానికి పడిపోయింది. 

PREV
15
డబ్ల్యూటీసీలో టీమిండియా స్థానం చేంజ్..

డబ్ల్యూటీసీ పాయింట్స్ పట్టికలో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకున్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించడంతో.. ఆ జట్టు ఏకంగా మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఈ విజయంతో కివీస్ 12 డబ్ల్యూటిసి పాయింట్‌లను దక్కించుకుని.. పాకిస్తాన్, భారత్‌లను కిందకు తోసింది.

25
ఆరో స్థానంలో భారత్, పాకిస్తాన్ ఐదు..

ఇక శ్రీలంక నాలుగో స్థానంలో ఉండగా.. ఐదో స్థానంలో ఉన్న టీమిండియా ఆరో స్థానానికి పడిపోయింది. దీంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడంలో అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన తర్వాత డబ్ల్యూటీసీ టేబుల్‌లో టీమిండియా స్థానం దెబ్బతింది.

35
ఓటములతో స్థానం దిగజారింది..

అంతకముందు ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేసి, వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-0తో గెలిచి టీమిండియా మూడో స్థానానికి ఎగబాకింది. అయితే, తాజా ఓటమి, అలాగే వెస్టిండీస్ జట్టుపై న్యూజిలాండ్ విజయంతో టీమిండియా ఆరో స్థానానికి పడిపోయింది. ఈ అనూహ్య మార్పులతో డబ్ల్యూటీసీ రేసు నుంచి టీమిండియా దాదాపుగా లేనట్టేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

45
ఇంగ్లాండ్ జట్టు పుంజుకుంటే..

ప్రస్తుతం ఆస్ట్రేలియా 100 పాయింట్స్ శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా యాషెస్ 2025-26 సిరీస్‌లో ఇంగ్లండ్‌పై 2-0 ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం భారత్ కేవలం 48.15 పాయింట్స్ శాతంతో ఉంది. ఇక యాషెస్ సిరీస్‌లోని మిగిలిన 3 మ్యాచ్‌లలో ఇంగ్లండ్ పున్జుకుంటే.. భారత్ ఏడో స్థానానికి పడిపోవడం ఖాయం.

55
భారత జట్టు నెక్స్ట్ టెస్ట్ అప్పుడే..

వచ్చే ఎనిమిది నెలలలో భారత జట్టు ఎలాంటి టెస్ట్ సిరీస్ ఆడదు. టీమిండియా తదుపరి టెస్ట్ సిరీస్ ఆగష్టు 2026 లో శ్రీలంకతో జరగనుంది. 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ మిగిలిన అన్ని మ్యాచ్‌లలో గెలవాల్సిందే.

Read more Photos on
click me!

Recommended Stories