డైమండ్ లీగ్ 2025: ఫైనల్‌లో నీరజ్ చోప్రా మెరుపులు

Published : Aug 29, 2025, 10:11 PM IST

Neeraj Chopra: డైమండ్ లీగ్ 2025 ఫైనల్‌లో నీరజ్ చోప్రా 85.01 మీటర్ల త్రో తో సిల్వర్ మెడల్ సాధించారు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు.

PREV
15
డైమండ్ లీగ్ 2025 ఫైనల్‌లో నీరజ్ చోప్రా

భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ 2025 ఫైనల్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరంలోని లెట్జిగ్రండ్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలో జర్మనీ అథ్లెట్ జూలియన్ వెబర్ 91.51 మీటర్ల అద్భుత త్రోతో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. నీరజ్ మాత్రం 85.01 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచారు.

DID YOU KNOW ?
నీరజ్ చోప్రాకు ఒలింపిక్ గోల్డ్ మెడల్
నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. భారతదేశానికి ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మొదటి క్రీడాకారుడు ఆయనే.
25
వరుస ఫౌల్స్.. చివరి ప్రయత్నంలో మెరిసిన నీరజ్ చోప్రా

ఈ పోటీలో నీరజ్ చోప్రా ఇబ్బందిగా కనిపించారు. ఆయన తొలి త్రో 84.35 మీటర్లకు చేరింది. రెండవ త్రోలో 82.5 మీటర్ల దాకా విసిరాడు. ఆ తర్వాత వరుసగా మూడు ఫౌల్స్ అయ్యాయి. దీంతో కొంత ఒత్తిడికి లోనయ్యారు. 

అయితే చివరి ఆరవ ప్రయత్నంలో 85.01 మీటర్ల వరకు విసిరి రెండో స్థానాన్ని కాపాడుకున్నారు. ఈ ప్రదర్శనతో కేశోర్న్ వాల్కాట్ (84.95 మీటర్లు)ను వెనక్కు నెట్టి సిల్వర్‌ను గెలుచుకున్నారు.

35
నీరజ్ పై జూలియన్ వెబర్ ఆధిపత్యం

జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ మొదటి త్రో నుంచే ఆధిపత్యం చూపారు. ఆయన తొలి ప్రయత్నంలోనే 91.37 మీటర్ల వరకు జావెలిన్ ను విసిరారు. తరువాతి ప్రయత్నంలో 91.51 మీటర్ల రికార్డు త్రో తో గోల్డ్ మెడల్ సాధించారు.

45
డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా ప్రయాణం

డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా 2022లో చరిత్ర సృష్టించారు. అప్పుడు ఆయన గోల్డ్ మెడల్ గెలిచి, ఈ టోర్నమెంట్ గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచారు. అయితే 2023, 2024, ఇప్పుడు 2025లో వరుసగా మూడు సార్లు సిల్వర్‌తో సరిపెట్టుకున్నారు. అయినప్పటికీ ఆయన స్థిరమైన ప్రదర్శన కొనసాగించారు.

55
వరల్డ్ అథ్లెటిక్స్‌కి సిద్ధమవుతున్న నీరజ్ చోప్రా

డైమండ్ లీగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు నీరజ్ చోప్రా దృష్టి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌పై ఉంది. ఈ పోటీ జపాన్ రాజధాని టోక్యోలో సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు జరుగుతుంది. తన టైటిల్‌ను కాపాడుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు.

ఫైనల్ మ్యాచ్ తర్వాత నీరజ్ మాట్లాడుతూ.. “ఈ రోజు టైమింగ్ బాగా రాలేదు. రన్ అప్‌లో తప్పిదం జరిగింది. కానీ మనకు వరల్డ్ ఛాంపియన్‌షిప్ వరకు ఇంకా మూడు వారాల సమయం ఉంది. ఆ లోపు నేను సరిచేసుకుంటాను. చివరి త్రోలో 85 మీటర్లు విసిరాను. జూలియన్ అద్భుతంగా విసిరాడు. మేము మూడు వారాల తర్వాత మళ్లీ కలుస్తాం” అని అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories