Neeraj Chopra: భళా బల్లం వీరుడా.. స్వర్ణంతో మెరిసిన నీరజ్‌

Published : Jul 06, 2025, 09:05 AM ISTUpdated : Jul 06, 2025, 09:06 AM IST

భారత జావెలిన్ లెజెండ్ నీరజ్ చోప్రా మరో అద్భుతాన్ని సృష్టించాడు. త‌న సొంత పేరుతో నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ ఈవెంట్‌లో గోల్డ్ మెడ‌ల్‌ను గెలుసుకొని అంద‌రి దృష్టిని ఆకట్టుకున్నాడు. 

PREV
16
స్వ‌ర్ణం అందుకున్న నీర‌జ్

భారత జావెలిన్‌ లెజెండ్‌ నీరజ్‌ చోప్రా తన పేరిట నిర్వహించిన తొలిసారి అంతర్జాతీయ ఈవెంట్‌ — ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ పోటీకి భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు. మూడో ప్రయత్నంలో 86.18 మీటర్ల దూరం బల్లం విసిరి అందరినీ ఆకట్టుకున్నాడు. గాలులు విరుచుకుపడుతున్నా నీరజ్‌ ప్రదర్శన అద్భుతంగా నిలిచింది.

26
మొద‌టి ప్ర‌య‌త్నంలో ఫౌల్ అయినా

మొదటి ప్రయత్నంలో ఫౌల్ అయినా, రెండో ప్రయత్నంలో 82.99 మీటర్లకు, మూడో ట్రైలో అత్యుత్తమంగా 86.18 మీటర్లకు బల్లాన్ని విసిరాడు. తర్వాతి ప్రయత్నాల్లో 84.07, 82.22 మీటర్ల దూరాల్ని నమోదు చేశాడు. అతని వ్యక్తిగత బెస్ట్‌ రికార్డు 90.23 మీటర్లు కాగా, ఇది మే 16న దోహాలో జరిగిన డైమండ్ లీగ్‌లో నమోదైంది.

36
కెన్యా, శ్రీలంకకు పతకాలు

ఈ పోటీలో కెన్యా అథ్లెట్‌ జూలియస్‌ యెగో 84.51 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు. శ్రీలంక ఆటగాడు రుమేష్‌ పతిరగే 84.34 మీటర్ల దూరంతో కాంస్యాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన సచిన్‌ యాదవ్‌ 82.33 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో బ్రాంజ్‌ చేజార్చుకున్నాడు.

46
హ్యాట్రిక్ విజ‌యం

2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో రజతం, దోహా డైమండ్‌ లీగ్‌ విజయం, ఆ తర్వాత ఓస్ట్రావా గోల్డెన్‌ స్పైక్‌ టైటిల్‌ గెలిచిన నీరజ్‌.. ఇప్పుడు ఈ "నీరజ్‌ చోప్రా క్లాసిక్‌" గెలిచి వరుసగా మూడో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

56
బరిలో నిలిచిన అంతర్జాతీయ అథ్లెట్లు

ఈ ఈవెంట్‌లో భారత్‌తో పాటు పలు దేశాల నుంచి అథ్లెట్లు పాల్గొన్నారు. పోలాండ్‌కు చెందిన సిప్రియన్ మ్రిజిగ్లాడ్, బ్రెజిల్ ఆటగాడు లూయిజ్ మౌరిసియో, అమెరికా నుంచి కర్టిస్ థామ్సన్, జర్మనీకి చెందిన థామస్ రోలెర్‌ వంటి స్టార్‌ అథ్లెట్లు పోటీలో ఉన్నా.. భారత్‌ వేదికగా నిర్వహించిన ఈ టోర్నీలో నీరజ్‌ చోప్రానే స‌త్తా చాటాడు.

టాప్ 6 ఫలితాలు

* నీరజ్‌ చోప్రా - 86.18

* జూలియస్‌ యెగో - 84.51

* రుమేష్‌ పతిరగే - 84.34

* సచిన్‌ యాదవ్ - 82.33

* కర్టిస్ థామ్సన్ - 81.50

* లూయిజ్‌ మౌరిసియో - 80.31

66
భార‌త క్రీడా చ‌రిత్ర‌లో మ‌రో మైలురాయి

ఒక అథ్లెట్‌ పేరుతో భారత్‌లోనే అంతర్జాతీయ స్థాయిలో అథ్లెటిక్‌ టోర్నీ నిర్వహించడం ఇదే మొదటిసారి కావ‌డం విశేషం. ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ ఈవెంట్‌ విజయవంతం కావడం భారత క్రీడా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది. భారత అథ్లెటిక్స్‌కు నూతన దిశలో ప్రేరణనిచ్చే ఈ విజయాన్ని నీరజ్‌ చోప్రా తన గోల్డెన్‌ త్రోతో మరిచిపోలేని విజయంగా మలిచాడు.

Read more Photos on
click me!

Recommended Stories