గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా సంపాదన ఎంతో తెలుసా?

Published : Aug 29, 2025, 10:39 PM IST

Neeraj Chopra Net Worth: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా జావెలిన్ ను గురిపెడితే గోల్డ్ పడాల్సిందే. ఆటలోనే కాదు సంపాదనలోనూ నీరజ్ చోప్రా గోల్డెన్ బాయ్ గా ముందుకు సాగుతున్నారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్, పోటీల ద్వారా భారీగానే సంపాదిస్తున్నారు.

PREV
15
క్రీడలతో పాటు ఆదాయంలో కూడా నీరజ్ చోప్రా మెరుపులు

భారత జావెలిన్ త్రోయర్, "గోల్డెన్ బాయ్" గా ప్రసిద్ధి చెందిన నీరజ్ చోప్రా క్రీడలతో పాటు ఆదాయంలోనూ అగ్రస్థానంలో ఉన్నారు. ఆటలో తన ప్రతిభతో దేశానికి గౌరవం తెచ్చిన ఆయన, సంపాదనలోనూ అదరగొడుతూ కోట్లల్లో సంపాదిస్తున్నారు. 

పలు మీడియా నివేదికల ప్రకారం.. 2025 నాటికి నీరజ్ చోప్రా నికర ఆస్తి సుమారు రూ. 37 కోట్లుగా అంచనా. చోప్రాకు ఆదాయం అనేక వనరుల నుంచి వస్తుంది. అందులో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, అంతర్జాతీయ పోటీలు, భారత ఆర్మీ ఉద్యోగం, ప్రభుత్వ బహుమతులు వంటివి ఉన్నాయి.

DID YOU KNOW ?
పారిస్ ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా
పారిస్ 2024 ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. ఆయన జావలిన్ త్రో ఫైనల్‌లో 89.45 మీటర్ల దూరం విసిరి ఈ పతకాన్ని సాధించారు. ఈ పతకంతో, నీరజ్ చోప్రా రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన అతి కొద్దిమంది భారతీయ అథ్లెట్లలో ఒకరిగా నిలిచారు.
25
అంతర్జాతీయ పోటీలతో నీరజ్ చోప్రాకు భారీ ఆదాయం

మీడియా నివేదికల ప్రకారం, నీరజ్ చోప్రా సంవత్సరానికి సుమారు రూ. 4 కోట్లు జీతంగా పొందుతున్నారు. అయితే ఇది ఆయన మొత్తం ఆదాయంలో కేవలం 10 శాతం మాత్రమే. దేశ విదేశాల్లో జరిగే వివిధ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని విజయం సాధించడం ద్వారా ఆయనకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోంది.

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో జరిన డైమండ్ లీగ్ 2025 ఫైనల్‌లో ఇబ్బంది పడ్డారు. కానీ, రన్నరఫ్ గా సిల్వర్ మెడల్ ను సాధించారు. గ్రెనడాకు చెందిన డిఫెండింగ్ చాంపియన్ ఆండర్సన్ పీటర్స్, జర్మనీకి చెందిన జూలియర్ బేబర్ వంటి ఆటగాళ్లతో ఫైనల్ లో తలపడ్డారు.

35
బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో చోప్రాకు కోట్ల ఆదాయం

నీరజ్ చోప్రా ఇప్పుడు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ రంగంలోనూ క్రీడాకారుల జాబితాలో టాప్ లో కొనసాగుతున్నారు. భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ తర్వాత ప్రకటనల ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుడు ఆయనే.

JSW Sports, Omega, Mobil India, Limca, Tata AIA Life Insurance, MuscleBlaze, Nike, Under Armour వంటి ప్రముఖ బ్రాండ్లతో నీరజ్ చోప్రా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పలు రిపోర్టుల ప్రకారం.. నీరజ్ చోప్రా ఎండార్స్‌మెంట్ ఫీజు సంవత్సరానికి రూ. 4 కోట్ల నుంచి రూ. 4.5 కోట్ల వరకు ఉంటుంది.

45
భారత ఆర్మీ నుండి ఆదాయం పొందుతున్న నీరజ్ చోప్రా

క్రీడాకారుడిగానే కాకుండా నీరజ్ చోప్రా భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో కూడా కొనసాగుతున్నారు. ఇండియన్ డిఫెన్స్ అకాడమీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఆయనకు రూ. 1,12,200 నుండి రూ. 2,12,400 వరకు నెలసరి జీతం లభిస్తుంది. ఇది ఆయన స్థిరమైన ఆదాయ వనరులో ఒకటిగా ఉంది.

55
ప్రభుత్వ బహుమతులు, అవార్డులతో నీరజ్ చోప్రాకు ఆదాయం

నీరజ్ చోప్రా తన అద్భుత ప్రతిభతో దేశ విదేశాల్లో అనేక అవార్డులు, ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తరువాత, హర్యానా ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం, ఇండియన్ రైల్వే తదితర సంస్థల నుండి భారీ మొత్తంలో నగదు బహుమతులు అందుకున్నారు. ఇలాంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఇతర అవార్డులు ఆయన ఆదాయానికి ముఖ్యమైన వనరుగా నిలుస్తున్నాయి.

గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఆటలోనూ, ఆదాయంలోనూ అగ్రస్థానంలో నిలుస్తూ భారత యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికలలో విజయాలు సాధించడంతో పాటు బ్రాండ్ విలువను పెంచుకుంటూ కోట్లలో సంపాదిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories