Mohammed Siraj: హైద‌రాబాదీ చిచ్చ‌ర పిడుగు.. సిరాజ్ మొబైల్ వాల్ పేప‌ర్‌పై ఎవ‌రి ఫొటో ఉంటుందో తెలుసా?

Published : Aug 05, 2025, 09:57 AM IST

టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ పేరు మారుమోగుతోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఇంగ్లండ్‌తో జ‌రిగిన 4వ టెస్ట్‌లో చెల‌రేగిన సిరాజ్ టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. 

PREV
15
ఐదు టెస్టుల్లో నిరంతర పోరాటం

సిరీస్ మొత్తం ఐదు టెస్ట్‌లు ఆడిన ఏకైక ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్. తొలి బంతి నుంచి చివరి బంతి వరకూ 1113 బంతులు వేయడం అతని ధృడ నిశ్చయానికి నిదర్శనం. సుదీర్ఘ సిరీస్‌ సమయంలో విశ్రాంతి తీసుకోకుండా, గాయాలు పట్టించుకోకుండా ప్రతీ మ్యాచ్‌లో 100 శాతం శ్రమించాడు. ఫిట్‌నెస్ సమస్యలతో ఒక్క క్షణం కూడా మైదానాన్ని వదల్లేదు.

DID YOU KNOW ?
మూడో బౌల‌ర్‌గా
హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో 46 టెస్టు వికెట్లు తీశాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు.
25
క్రిస్టియానో రొనాల్డో నుంచి స్ఫూర్తి

లండన్‌లో ఐదో టెస్ట్ ఉదయం సిరాజ్ సాధారణ సమయానికి రెండు గంటల ముందే లేచాడు. తనకు ఉత్సాహం కలిగించేలా క్రిస్టియానో రొనాల్డో ఫోటోని డౌన్‌లోడ్ చేసి, దానిపై “Believe” అనే పదం రాసి ఫోన్ వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాడు. మ్యాచ్ ముందురోజు నుంచి అదే తనకు ప్రేరణగా మారిందని, విజయం సాధించిన తరువాత మీడియా ముందు ఫోన్ వాల్‌పేపర్‌ని గర్వంగా చూపించాడు.

35
ఐదో రోజు కీలక వికెట్లు

ఓవల్ టెస్ట్‌లో చివరి రోజు సిరాజ్ చేసిన బౌలింగ్ భారత్ గెలుపుకు మార్గం సుగమం చేసింది. జెమీ స్మిత్ వికెట్ తీసి తొలి దెబ్బ కొట్టాడు. అనంతరం అట్కిన్సన్‌ను యార్కర్‌తో బౌల్డ్ చేసి ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచాడు. చివరికి 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఇంగ్లాండ్ 367 పరుగులకే ఆలౌట్ అయింది.

45
వోక్స్ ధైర్యమైన ఇన్నింగ్స్

ఇంగ్లాండ్‌కు చివరి ఆశగా నిలిచిన వోక్స్, భుజం గాయంతో బాధపడుతున్నప్పటికీ ఎడమ చేతితో బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి దిగాడు. జట్టు ఓడినా, అతని పట్టుదల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సిరీస్ ఉత్కంఠను చివరి వరకు కొనసాగించిన ఘట్టంగా ఇది నిలిచిపోయింది.

55
ఇంగ్లాండ్ దిగ్గజాల ప్రశంసలు

భారత్ గెలుపులో సిరాజ్ ప్రదర్శన చూసి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు అథర్టన్, మైఖేల్ వాన్, నాసిర్ హుస్సేన్‌లు ప్రశంసల వర్షం కురిపించారు. “సింహంలా పోరాడిన బౌలర్… లయన్ హార్ట్” అని సిరాజ్‌ను కొనియాడారు. తన ఆత్మవిశ్వాసం, పట్టుదలతో సిరీస్ మొత్తం భారత్ బౌలింగ్ విభాగానికి కొత్త శక్తినిచ్చాడు.

Read more Photos on
click me!

Recommended Stories