ఇదేం రికార్డు మిచెల్ మార్షూ.. దీన్ని బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యమే!

Published : Apr 05, 2025, 08:20 AM IST

పవర్ ప్లేలో ఉండేవి ఆరు ఓవర్లు.. మొత్తం 36 బంతులు.. అందులో ఒక్కడే 30 బంతులు ఆడేశాడు. అరుదైన రికార్డు నెలకొల్పాడు మిచెల్ మార్ష్.  ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ చరిత్ర సృష్టించాడు.

PREV
12
ఇదేం రికార్డు మిచెల్ మార్షూ.. దీన్ని బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యమే!
ధావన్ రికార్డ్ బ్రేక్

మిచెల్ మార్ష్ అరుదైన ఇన్నింగ్స్ తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ముంబై ఇండియన్స్‌ ఓడింది.  లక్నో గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఓపెనర్ మిచెల్ మార్ష్ బ్యాటింగ్‌తో హిస్టరీ క్రియేట్ చేశాడు. పవర్ ప్లేలో 30 బంతులు ఆడిన తొలి బ్యాటర్గా నిలిచాడు. గతంలో అత్యధిక బంతులు ఆడిన రికార్డు శిఖర్ ధావన్ పేరున ఉండేది.

22
ఐపీఎల్‌లో కొత్త రికార్డు

మిచెల్ మార్ష్ బ్యాటింగ్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 69 రన్స్ చేసింది. పవర్ ప్లేలో మార్ష్ హాఫ్ సెంచరీ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించిన మిచెల్ మార్ష్ స్టార్టింగ్ నుంచే రెచ్చిపోయాడు. ఐపీఎల్ హిస్టరీలో పవర్ ప్లేలో 30 బంతులు ఆడిన తొలి బ్యాటర్.

Read more Photos on
click me!

Recommended Stories